చిక్కుల్లో  కేరళ సిఎమ్ 

FIR Kerala Cheif Minister

06:17 PM ON 28th January, 2016 By Mirchi Vilas

FIR Kerala Cheif Minister

మరో కుంభకోణం మరో సిఎమ్ ని తాకింది. సోలార్‌ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు సరిత ఎస్‌ నాయర్‌ చేసిన ఆరోపణలతో ముఖ్యమంత్రి వూమెన్‌ చాందీ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. అక్కడి త్రిస్సూర్‌ విజిలెన్స్‌ కోర్టు ఆయన పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించింది. చాందీ పై అవినీతి ఆరోపణలతో గురువారం తిరువనంతపురంలో ప్రజలు ఆందోళన కు దిగారు. సచివాలయం వద్ద ఆందోళనకారులను అదుపుచేయడానికి పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేస్తుండడంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాగా సోలార్‌ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు సరిత ఎస్‌ నాయర్‌ బుధవారం కేరళ సీఎం వూమెన్‌ చాందీ, విద్యుత్‌ మంత్రి అరయదన్‌ మహమ్మద్‌లకు లంచం ఇచ్చానని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చాందీ అనుచరుడికి రూ.1.90 కోట్లు, మహమ్మద్‌ అనుచరుడికి రూ.40లక్షలు లంచం ఇచ్చినట్లు ఆమె ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను సీఎం, మంత్రి ఖండిస్తూ, తనపై చేస్తున్న ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. కావాలనే కొందరు బార్‌ యజమానులు తనపై ఆరోపణలు చేయిస్తున్నట్లు వుందని ఆయన అనుమానం వ్య్వక్తం చేసారు.

English summary

Court ordered police to file a FIR On Kerala Cheif Minister Oommen Chandy on Solar Scam.The main accused woman in solar scam Sarita S Nayar had made some accusations on him.