బాలీవుడ్‌ నటుడు నవాజుద్దిన్‌ సిద్దిఖిపై ఎఫ్ఐఆర్

FIR On Nawazuddin Siddiqui

10:01 AM ON 3rd February, 2016 By Mirchi Vilas

FIR On Nawazuddin Siddiqui

పార్కింగ్‌ స్థలంలో ఓ మహిళను నెట్టిసి, ఆమె పై దౌర్జన్యం చేసినందుకు కేసు దాఖలైన ఘటనలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నవాజుద్దిన్‌ సిద్దిఖిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే తన పై కిట్టనివాళ్ళు చేసిన పనే ఇది అని నవాజుద్దిన్‌ అంటున్నాడు. ఈ మధ్యే తాను నటించిన ‘‘మాన్‌ఝీ- ది మౌంటెన్‌ మ్యాన్‌’’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందు కోవడంతో, ఆ విజయాన్ని జీర్ణించుకోలేని కొందరు ఇలా కక్ష తీర్చుకునేందుకు సాహసించా రంటూ సిద్ధిఖి ఆరోపిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే, పార్కింగ్‌ స్థలం గురించి నవాజుద్దిన్‌ నివసించే కాలనీ యాజమాన్యం అతనికి నోటీసు జారీ చేసింది. అయినా నవాజుద్దిన్‌ స్పందించలేదు. పైగా అలాంటి నోటీసేదీ తనకు అందలేదని బుకాయించాడు. అతడు కారు నిలిపే స్థలం ద్విచక్రవాహనాలకు కేటాయించినదని హీనాషేక్‌ అనే మహిళ కేసు పెట్టింది. అసలామెను తన కాలనీలోనే చూడలేదని నవాజుద్దీన్‌ వాదన. ఆమె పెట్టిన కేసు మేరకే ఎఫ్ఐఆర్ కట్టారు. మరి ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో.

English summary

Bollywood Actor Nawazuddin Siddiqui was struck in a police case. A woman named Heena Sheik filed a police case on Nawazuddin Siddiqui by saying that he was attacked on her.This was opposed by Nawazuddin Siddiqui and says she was the unknown person of him.