కెమికల్స్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం 

Fire Accident In Chemical GoDown

12:25 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Fire Accident In Chemical GoDown

విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం రాజవరంలోని దక్కన్‌ కెమికల్స్‌ పరిశ్రమలో ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. రసాయనాలు నిల్వ ఉంచే గోడౌన్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు గాయపడ్డారు. దట్టమైన పొగలతో మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగిన వెంటనే కర్మాగారం చుట్టుపక్కల రాజవరం, కేశవరం, గజపతినగరం గ్రామాల్లోని ప్రజలు భయంతో పొలాల్లోకి పరుగులు తీశారు. మండలంలోని ఈ గ్రామాలతో పాటు పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. ఇక ఈ మంటల నుంచి వచ్చే రసాయనాల దుర్గంధం భరించలేక ట్రాక్టర్లు, ఇతర వాహనల్లో తుని ప్రాంతానికి తరలి వెళ్లారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంతో తుని-పాయకరావుపేట పరిసరాల్లో పొగ దట్టంగా అలుముకుంది. ఆర్డిఓ సూర్యారావు సంఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు. దావోస్ పర్యటనలో వున్న ఎపి సిఎమ్ చంద్రబాబు ఈ ప్రమాదం గురించి ఆరా తీసారు. క్షత గాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, సహాయక చర్యలు యుద్దప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు.

English summary

A fire accident occurred in chemical Go-Down in Payakarao Peta , Vishakapatnam District. In this incident no one was died.Andhra Pradesh Chief Minister Nara Chandra Babu Naidu ordered government officials to provide better Medical treatment who were injured in this incident