షుగర్ ఫాక్టరీలో అగ్ని ప్రమాదం

Fire Accident In Delta Sugar Factory

06:41 PM ON 15th February, 2016 By Mirchi Vilas

Fire Accident In Delta Sugar Factory

ఎపిలోని కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌ సమీపంలోని డెల్టా షుగర్ ఫాక్టరీలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించి, ఫాక్టరీ ఆవరణలో నిల్వ ఉంచిన 22వేల టన్నుల బెగాస్‌ అగ్నికి ఆహుతైంది. విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌వల్ల అగ్ని కీలలు వ్యాపించి నిమిషాల వ్యవధిలోనే బెగాస్‌ కుప్పలను చుట్టిముట్టినట్లు ఫాక్టరీ వర్గాల కధనం. హనుమాన్‌ జంక్షన్‌, ఏలూరు, గన్నవరం, గుడివాడ ఇతర సమీప ప్రాంతాల్లోని అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసారు. అయితే నష్టం ఏమేరకు వాటిల్లిందనే విషయంపై అంచనాలు వేస్తున్నామని ఫాక్టరీ వర్గాలు అంటున్నాయి. ఎండ, గాలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో మంటలను అదుపు చేయడం చాలా కష్టమైంది. దీంతో నష్టం ఎక్కువగానే వున్నట్లు చెబుతున్నారు.

English summary

Fire accident occured in Delta Sugar Factory near Hanuman Junction In Krishna district. Bagasse stocks worth some lakhs of rupees were destroyed in this fire accident