ఘోర అగ్ని ప్రమాదం.. మంటల్లో చిన్నారులు

Fire accident in Hyderabad

03:21 PM ON 9th April, 2016 By Mirchi Vilas

Fire accident in Hyderabad

వేసవి మండిపోతున్న నేపధ్యంలో అక్కడక్కడా అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓల్డ్ సిటీ లోని తలాబ్‌ కట్టాలోని బన్‌ రోటీ తయారీ కేంద్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో కిరోసిన్‌ డబ్బాలు ఉండటంతో మంటలు చెలరేగాయి. ఆ ఘటనలో 12 మందికి గాయాలు అయ్యాయి. క్షత గాత్రులలో 8 మంది చిన్నారులు ఉన్నారు. గాయపడిన వాళ్ళను హుటాహుటిన అసుపతికి తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి అగ్నిమాపక దళం చేరుకొని మంటలును అదుపులోకి తెచ్చింది. కాగా పాత బస్తీలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

తెల్లవారుజామున వారు నిద్రపోయే సమయంలో ఈ ఘటన జరిగింది. ప్లాస్టిక్ వస్తువులు కాలడంతో.. భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. సిబ్బంది సీతారామరాజు, ఉదయ్, హేమీద్ అనే ముగ్గురు ఇతరులతో కలసి పై భాగంలోని రేకులు పగులకొట్టి ఆ ఇంట్లో కి దిగి ఆ చిన్నారులను కాపాడారు.

English summary

Fire accident in Hyderabad. Huge fire accident at Hyderabad old city.