మేక్‌ ఇన్‌ ఇండియా వారోత్సవంలో అగ్నిప్రమాదం    

Fire Accident in Make In India Week Event

10:30 AM ON 15th February, 2016 By Mirchi Vilas

Fire Accident in Make In India Week Event

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో జరుగుతున్న మేక్‌ ఇన్‌ ఇండియా వారోత్సవాల కార్యక్రమంలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో సాంస్కృతిక కార్యక్రమాల వేదిక వద్ద భారీగా మంటలు అంటుకున్నాయి. సరిగ్గా వేదికపై కళాకారులు ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసు కోవడం, వేదిక పూర్తిగా దగ్ధమై కుప్పకూలడం నిమిషాల్లోనే జరిగిపోయింది. ప్రమాద సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, ఆ రాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, బాలీవుడ్‌ నటులు అమితాబ్‌, ఆమీర్‌ఖాన్‌, మధుర ఎంపీ హేమమాలిని తదితరులు అక్కడే ఉన్నారు. అయితే వీరందరినీ పోలీసులు సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. ఇక ప్రాణభయంతో కళాకారులు, వీక్షకులు పరుగులు తీశారు. ఘటనాస్థలికి చేరుకున్న 14 అగ్నిమాపక శకటాలు, 10 నీటి ట్యాంకర్లతో అగ్ని మాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మొత్తానికి పెను ప్రమాదం తప్పింది.

English summary

Fire Accident was occurred in Make In India Week Event which was conducted in India's financial Capital Mumbai.At the time of fire accident In this event there were Amitabh Bachchan,Hema Malini,Devendra Fadnavis and some other celebrities were also there in that event.