సౌదీ ఆస్పత్రిలో ఘోర ప్రమాదం: 25మంది దుర్మరణం

Fire Accident in Saudi Arabia hospital, 25 killed

05:47 PM ON 24th December, 2015 By Mirchi Vilas

Fire Accident in Saudi Arabia hospital, 25 killed

సౌదీ అరేబియాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. జీజన్‌ నగరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 25 మంది మృతిచెందగా, మరో 100 మందికి తీవ్రగాయాలయ్యాయి.

ఆస్పత్రిలోని మొదటి అంతస్తులో ఉన్న ఐసీయూ, మెటర్నిటీ వార్డులో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత పై అంతస్తుకు కూడా మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు.

అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ప్రమాదానికి గాల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

English summary

Fire accident happened at one of the hospital in southern Saudi Arabia and 25 people were killed.