పుట్టింగల్‌దేవి ఆలయంలో అగ్నిప్రమాదం: 106 మంది మృతి

Fire Accident Killed 106 People In Puttingal Devi Temple

09:39 AM ON 11th April, 2016 By Mirchi Vilas

Fire Accident Killed 106 People In Puttingal Devi Temple

అత్యంత విషాదం ఇది ... బాణాసంచా పేలి , కేరళ రాష్ట్రం కొల్లంలోని పుట్టింగల్‌దేవి ఆలయంలో ఈరోజు తెల్లవారుజామున 3గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 106 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 350మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతాయని అంటున్నారు. ఆలయ వేడుకల్లో భాగంగా కొందరు భక్తులు బాణసంచా కాల్చడంతో ప్రమాదవశాత్తూ పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఆలయం నలువైపులా వ్యాపించాయి. భారీ శబ్దాలతో పేలుళ్లు, అగ్నికీలలు చూసి ఆలయంలో ఉన్న భక్తులు భయంతో ఒక్కసారిగా పరుగులు పెట్టారు. అగ్ని ప్రమాదంలో కొందరు మృతిచెందగా, తొక్కిసలాటలో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. బాణసంచా పేలుళ్ల ధాటికి భవనాలు సైతం కుప్పకూలాయంటే ప్రమాద తీవ్రత ఎలా ఉందో వేరే చెప్పనవసరం లేదు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలు ఆర్పివేశారు.

ఇవి కూడా చదవండి : పెళ్ళికి ముందే తల్లులైన స్టార్ హీరోయిన్లు

క్షతగాత్రులలో ఎక్కవ మందిని త్రివేండ్రం వైద్య కళాశాలకు, సమీపంలోని మరికొన్ని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో జనసమూహం ఎక్కువగా ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. అగ్నిమాపక సిబ్బంది, సహాయక సిబ్బంది ప్రొక్లెన్ల సాయంతో శిథిలాలను తొలగించి క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించారు. ఆలయం వద్ద బాణసంచా పేలుడుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని అధికారులు పేర్కొంటూ, పుట్టింగల్‌ ఆలయ అధికారులు, బాణసంచా లైసెన్సు దారులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. . ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించినట్లు కేరళ హోం మంత్రి రమేశ్‌ చెన్నితల తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కేరళ ముఖ్యమంత్రి వూమెన్‌ చాందీ, మంత్రులు పరిశీలించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఘటనాస్థలి నుంచే ప్రదాని మోడీతో ఫోన్‌లో మాట్లాడారు. అన్ని విధాలా సహకరిస్తామని వూమెన్‌ చాందీకి ప్రధాని మోడీ తెల్పారు.

ఇవి కూడా చదవండి : బ్రహ్మీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

పుట్టింగల్‌ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సందర్శించారు. ఆలయ పరిసరాలను పరిశీలించిన ఆయన ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మోదీ వెంట కేరళ సీఎం వూమెన్‌ చాందీ తదితరులు ఉన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారు. కాగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘటనా స్థలాన్ని సందర్శించి, క్షతగాత్రులను పరామర్శించారు. వాళ్లకు అందుతున్న వైద్యం, ప్రస్తుత పరిస్థితిపై వాకబు చేశారు. కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ఏకె. ఆంటోని రాహుల్‌తో పాటు ఉన్నారు.

ఇవి కూడా చదవండి :

శివుడు పార్వతి ని పెళ్ళాడింది ఇక్కడే..

శివలింగం రూపం వెనక ఉన్న గణిత శాస్త్రం

ఘోర అగ్ని ప్రమాదం.. మంటల్లో చిన్నారులు

English summary

A Fire Accident In Puttingal Devi Temple in Kerala State Killed 106 People and more than 350 people were injured in this incident. Kerala Chief Minister,Rahul Gandhi, Prime Minister Of India Narendra Modi were visited this place and aksked the officilas the reasons behind this incident