అగ్నిప్రమాదంలో నలుగురి సజీవదహనం

Fire Accident killed Four People In Jammu And Kashmir

01:06 PM ON 1st March, 2016 By Mirchi Vilas

Fire Accident killed Four People In Jammu And Kashmir

అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవదహనమయ్యారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భాగ్వా గ్రామానికి చెందిన అబ్దుల్‌ రషీద్‌ అనే వ్యక్తి ఇంట్లో విద్యుత్‌ షాట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు వ్యాపించాయి. మంటల్లో అబ్దుల్‌ రషీద్‌ తో పాటూ అతని కుటుంబసభ్యులు మరో ముగ్గురు సజీవదహనమయ్యారు. మృతుల్లో 6నెలల చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన తో అక్కడ తీవ్ర విషాదం అలుముకుంది.

English summary

In a Fire accident in Jammu Kashmir killed four people.Those four people were belongs to same family.This fire accident was occurred due to Short circuit.