నెట్‌వర్క్ లేకున్నా చాటింగ్..

Fire Chat App Allows To Chat Without Internet

04:42 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Fire Chat App Allows To Chat Without Internet

ఫోన్‌లో చాటింగ్ చేయాలంటే సెల్యులర్ నెట్ లేదా వైఫైల ద్వారా ఇంటర్నెట్ డేటా తప్పక ఉండాలి. ఇప్పుడా అవసరం లేదు. మీ ఫోన్‌లో ఇంటర్నెట్, నెట్‌వర్క్ లేకపోయినా చాంటిగ్ చేయొచ్చు. ఇందుకోసం ఫైర్‌చాట్ యాప్ వచ్చేసింది. గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి ఆండ్రాయిడ్ వినియోగ దారులందరూ ఈ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను యూజర్లు ఎక్కడైనా, ఎప్పుడైనా వాడొచ్చు.

బ్లూటూత్ కమ్యూనికేషన్ సాధనంతో ఇది పనిచేస్తుంది. దీని ద్వారా కేవలం మెసేజ్‌లే కాకుండా ఫొటోలు పంపే వెసలుబాటు కూడా ఉంది. ప్రైవేట్ మెసేజెస్, లైవ్ చాట్ రూమ్స్, గ్రూప్ మెసేజింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. చెన్నై వరద బాధితులు ఈ యాప్‌ను ఇటీవల బాగా వాడుకున్నారు. స్మార్ట్‌ఫోన్లను ఉపయోగించే అనేక మంది యూజర్లు ఫైర్ చాట్ ద్వారా కనెక్ట్ అయ్యారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బ తినడంతో ఈ యాప్ ద్వారా కనెక్ట్ అయి సమాచార మార్పిడి జరుపుకొన్నాను.

English summary

A new chatting app named "Fire Chat" allows you to chat without internet. By using this app we can send text messages,images ,videos to our beloved ones without internet connection