ఈ ఫోన్లు తిరిగివ్వడానికి ఏకంగా ఫైర్ ప్రూఫ్ బాక్సులు!

Fire proof boxes for to return Samsung galaxy note 7 phones

10:58 AM ON 14th October, 2016 By Mirchi Vilas

Fire proof boxes for to return Samsung galaxy note 7 phones

ఊహించని విధంగా గెలాక్సీ నోట్ 7 ఫోన్లకు దెబ్బ తగలడంతో సామ్ సంగ్ కంపెనీ చేపట్టిన నష్టనివారణ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సామ్ సంగ్ ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ నోట్ 7 ఫోన్లు పేలిపోతుండడంతో వాటిని కంపెనీ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించిన సంగతి తెల్సు కదా. అయితే ఫోన్లను వెనక్కి పంపే విషయంలో సోషల్ మీడియాలో పలు పుకార్లు వస్తుండడంతో కంపెనీ నోట్ 7లను వెనక్కి పంపడానికి వినియోగదారులకు ఫైర్ ప్రూఫ్ బాక్సులు, ప్రొటెక్టివ్ గ్లోవ్స్ పంపిస్తోంది. తమ వెబ్ సైట్ ద్వారా గెలాక్సీ నోట్ 7 ఫోన్లను కొనుగోలు చేసిన వారికి వాటిని వెనక్కి పంపడానికి ఫైర్ ప్రూఫ్ రిటన్ కిట్ పంపుతున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికాలో కంపెనీ ఇప్పటికే ఫైర్ ప్రూఫ్ కిట్ లను పంపించడం ప్రారంభించింది.

నోట్ 7 బ్యాటరీలకు మంటలు అంటుకున్న ఘటనలు జరగడంతో కంపెనీ ఇటీవల తాత్కాలికంగా గెలాక్సీ నోట్ 7ల తయారీని నిలిపేసింది. అప్పటిదాకా అమ్మిన ఫోన్లను వెనక్కి పిలిచి వాటి స్థానంలో వేరే ఫోన్లను పంపించింది. అయితే రెండోసారి పంపిన ఫోన్లు కూడా కొన్ని పేలినట్లు వార్తలు రావడంతో సామ్ సంగ్ ఇబ్బందుల్లో పడింది. దీంతో పలు రకాలుగా నష్టనివారణకు ప్రయత్నిస్తోంది. స్వదేశమైన దక్షిణ కొరియాలో గెలాక్సీ నోట్ 7లను ఎక్ఛ్సేంజి చేసుకునే వినియోగదారులకు అదనంగా ఆర్థిక ప్రోత్సాహకాలను కూడా ఇవ్వనున్నట్లు సామ్ సంగ్ తెలిపింది. నోట్ 7కు బదులుగా ఇతర మోడల్ ఫోన్ ఇవ్వడంతో పాటు అదనంగా డబ్బు కూడా ఇవ్వబోతోందని చెబుతున్నారు.

English summary

Fire proof boxes for to return Samsung galaxy note 7 phones