త్వరలో ఫైర్‌ఫాక్స్ ఓఎస్ ఆధారిత ఉత్పత్తులు

Firefox OS for routers, tablets, and keyboards

04:32 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Firefox OS for routers, tablets, and keyboards

మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ ఇంటర్నెట్ బ్రౌజర్ ప్రపంచంలో ఎక్కువ మంది వినియోగించే బ్రౌజర్లలో ఇదీ ఒకటి. మొజిల్లాకు చెందిన ఈ ఓపెన్‌సోర్స్ బ్రౌజర్ పేరిట గతంలో మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా వచ్చింది. ఫైర్‌ఫాక్స్ ఓఎస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్లు గతంలో మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. కానీ దీనికి అంతగా ఆదరణ లభించలేదు. దీంతో ఆ ఓఎస్‌కు మొజిల్లా ఫుల్‌స్టాప్ పెట్టింది. అయితే దీనిని స్మార్ట్‌ఫోన్లకు కాకుండా పీసీలు, ట్యాబ్లెట్లు, వైఫై రూటర్లు, ఇంటర్నెట్ డాంగిల్స్‌, కీబోర్డుల్లో ప్రవేశపెట్టేందుకు మొజిల్లా ఏర్పాట్లు చేస్తోంది. ఫైర్‌ఫాక్స్ ప్యాడ్ పేరిట ఓ 10 ఇంచుల టాబ్లెట్‌ను, ఫైర్‌ఫాక్స్ పై పేరిట కీ బోర్డ్ కంప్యూటర్‌ను, ఫైర్‌ఫాక్స్ హబ్ పేరిట ఓ ఫైర్‌వాల్ సెక్యూరిటీ పరికరాన్ని, ఫైర్‌ఫాక్స్ స్టిక్ పేరిట ఓ హెచ్‌డీఎంఐ డాంగిల్‌ను రూపొందిస్తోంది. త్వరలోనే ఇవి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫైర్ ఫాక్స్ ఓఎస్ ఆధారిత డివైస్‌లు వినియోగదారులను ఏ మేరకు ఆకట్టుకుంటాయో చూడాలి.

English summary

Firefox OS for routers, tablets, and keyboards