పానసోనిక్‌ నుంచి ఫైర్‌ఫాక్స్‌ ఓఎస్‌ టీవీ

Firefox OS Televisions From Panasonic

03:48 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

Firefox OS Televisions From Panasonic

ఇప్పటి వరకూ పీసీలు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లకే పరిమితమైన ఫైర్‌ఫాక్స్‌ ఓఎస్‌ ఇకపై టీవీల్లోనూ సందడి చేయనుంది. ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల సంస్థ పానసోనిక్ తన కొత్త డీఎక్స్‌ సిరీస్‌ యూహెచ్‌డీ టీవీల్ని ఫైర్‌ఫాక్స్‌ ఓఎస్‌తో విడుదల చేసింది. ఈ టీవీలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. లైవ్‌టీవీ, యాప్స్‌, వ్యక్తిగత డివైజ్‌లకు కనెక్ట్‌చేసుకోడానికి వీలుగా ఈ టీవీ స్క్రీన్‌లను కస్టమైజ్‌ చేసింది. దీని ద్వారా వెబ్‌యాప్స్‌, గేమ్స్‌, వార్తలు, కోరుకున్న వీడియోలు, వాతావరణ సమాచారం తదితరాల్ని వెబ్‌ నుంచి చూసేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ టీవీల్ని ఫైర్‌ఫాక్స్‌ ఓఎస్‌ కొత్త వెర్షన్‌కి అప్‌గ్రేడ్‌ చేస్తామని పానసోనిక్ పేర్కొంది.

English summary

Panasonic company has announced that it was going to launch new televisions with firefox Operating system in its new DX-series.