మొదట్లో హిల్లరీ.. ఆతర్వాత ట్రంప్

First Hillary next Trump

12:24 PM ON 9th November, 2016 By Mirchi Vilas

First Hillary next Trump

అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. ట్రంప్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ ల మధ్య హోరాహోరీ పోరు జరిగినట్టు ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. కనెక్టికట్, డెలావెర్, ఇల్లినాయిస్, మేరీలాండ్, మసాచుసెట్స్, న్యూజెర్సీ, రోడ్ ఐలాండ్ వెర్మెంట్ రాష్ట్రాల్లో హిల్లరీ ఆధిక్యంలో వున్నట్టు ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది. కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపులో మొదట్లో హిల్లరీ ఆధిక్యం సాధించినా అనంతరం ట్రంప్ దూసుకువస్తున్నారు. దీంతో ఎవరు గెలుస్తారన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అలబామా, ఇండియానా, కెంటకీ ఒక్లాహామా, సౌత్ కరొలినా, టెన్నిసీ, వర్జీనియా రాష్ట్రాల్లో ట్రంప్ కు ఆధిక్యం లభించింది.

1/5 Pages

ఫ్లోరిడానే కీలకం కీలక రాష్ట్రమైన ఫ్లోరిడా తిరిగి ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడ ఎక్కువ సీట్లు సాధిస్తే ట్రంప్ కు విజయం వరించే అవకాశముంది. ఒక వేళ ఫ్లోరిడాలో హిల్లరీ విజయం సాధిస్తే పెన్సిల్వేనియా రాష్ట్రంలో ట్రంప్ విజయం సాధించాలి. వాస్తవానికి ఓటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అమెరికా ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. న్యూ హ్యాంప్ షైర్ లోని డిగ్జ్ విల్లే నాచ్ లో పోలింగ్ పూర్తయి ఫలితం వచ్చేసింది.

English summary

First Hillary next Trump