'శాతకర్ణి' ఫస్ట్ లుక్

First look poster of Balakrishna Gautamiputra Satakarni

10:38 AM ON 10th June, 2016 By Mirchi Vilas

First look poster of Balakrishna Gautamiputra Satakarni

నందమూరి నటసింహం బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ పోస్టర్ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. బాలకృష్ణ ను ఇందులో బసవతారకపుత్ర బాలకృష్ణ అని సంబోధించి బర్త్ డే శుభాకాంక్షలు చెప్పారు. ఇంతకుముందు క్రిష్ తెరకెక్కించిన సినిమా పోస్టర్లలో క్రిష్ అని మాత్రమే ఉండేది. అయితే, ఈ పోస్టర్ లో అంజనాపుత్ర క్రిష్ అని డైరెక్టర్ పేరు ప్రచురించడం ఈ మూవీ పోస్టర్ విశేషం.

అంతేకాదు, మూవీ టీంలోని అందరి పేర్ల ముందు వాళ్ల తల్లిదండ్రుల పేర్లు ఉంచారు. ఎన్బికె 100 అనే స్టాంప్ తో ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా, ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న బాలయ్య బాబుకి ఎన్నారై ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొరాకో, హైదరాబాద్ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడో షెడ్యూల్ సోమవారం నుంచి జరగాల్సిఉంది. అమెరికాలో ఉన్న బాలకృష్ణ వచ్చిన తర్వాత హీరోయిన్ శ్రియ తో పలు సన్నివేశాలను మూడో షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. మొత్తానికి బాలయ్య అమెరికాలో పుట్టినరోజు సందడి చేసుకుంటున్న తరుణంలో 100వ చిత్రం పోస్టర్ రిలీజ్ అయింది.

English summary

First look poster of Balakrishna Gautamiputra Satakarni