ఆ సినిమాను మహేష్ ఎందుకు చేయలేదు???

First Mahesh Babu rejected the script to act in Surya 24

03:38 PM ON 26th November, 2015 By Mirchi Vilas

First Mahesh Babu rejected the script to act in Surya 24

ఇష్క్‌, మనం వంటి డిఫరెంట్‌ లవ్ కాన్సెప్ట్స్తో వచ్చిన దర్శకుడు విక్రమ్‌.కె.కుమార్‌. ఈయన తాజాగా తమిళ సూపర్‌స్టార్‌ సూర్యతో ఒక చిత్రం తెరకెక్కిస్తున్నారు. అదే '24', ఈ చిత్రంలో సూర్య నటించడంతో పాటు తనే స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఓ సైన్స్‌ ఫిక్షన్‌ కధాశంతో తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని ఇటీవలే విడుదల చేసారు. ఆ పోస్టర్స్‌ చూశాక చిత్రం పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎక్కడ చూసిన ఈ చిత్రం గురించే డిస్కస్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్త హల్‌చల్‌ చేస్తోంది.

ముందుగా ఈ చిత్ర కధని విక్రమ్‌కుమార్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌కి వినిపించచారంట, మహేష్‌కి కూడా కధ బాగా నచ్చిందట. కాకపోతే సెకాండాఫ్లో వచ్చే సీన్స్‌ మహేష్‌కి యాప్ట్‌ కావని ఈ చిత్రం చెయ్యడానికి అంగీకరించలేదట. ఆ తరువాత ఈ కధని సూర్యకి వినిపించగా, సూర్యకి కధ విపరీతంగా నచ్చి సింగిల్‌ సిట్టింగ్‌లో ఒకే చేశారట. ఈ చిత్రంలో సూర్య త్రిపాత్రిభినయం చేస్తున్నారు, సూర్య ఇంతకు ముందు సూర్య s/o. కృష్ణన్‌లో కూడా త్రిపాత్రిభినయం చేశారు. '24'లో సూర్య సరసన సమంత రెండో సారి జత కట్టబోతుంది. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చెయ్యబోతున్నారు.

English summary

First Mahesh Babu rejected the script to act in Surya 24 because he is not apt in second half scenes.