ఆలీకి పవన్ తో మొదటి పరిచయం ఎలా అయిందో తెలుసా?

First meeting between Ali and Pawan Kalyan

01:04 PM ON 11th July, 2016 By Mirchi Vilas

First meeting between Ali and Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-ఆలీకి మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా సార్లు అనేక ఆడియో ఫంక్షన్స్ లో పవన్ కళ్యాణ్ ఆలీ గురించి, ఆలీ పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెప్పడం మనం చూసాం. అయితే వీరిద్దరి మధ్య పరిచయం ఎలా జరిగింది? అసలు ఆలీని పవన్ కళ్యాణ్ కి ఎవరు పరిచయం చేశారు? వాళ్ళిద్దరి మధ్య ఎలా స్నేహం కుదిరింది? వంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ విషయంలోకి వెళ్తే.. 'ముగ్గురు మొనగాళ్లు' సినిమా షూటింగ్ టైంలో వర్షంలో షూటింగ్ చేసి అలసిపోయి జ్వరంతో బాధపడుతున్న చిరంజీవిని చూడటానికి వచ్చిన ఆలీని ఇంట్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఎంతో ఆప్యాయంగా పలకరించాడట.

అదే వారిద్దరి తొలి పరిచయమట. అప్పటికి పవన్ ఇంకా సినిమాల్లోకి రాలేదు. కానీ ఆలీ అప్పటికే చాలా సినిమాలు చేసేశాడు. ఆ తర్వాత పవన్ సినీ ఎంట్రీ జరిగింది. ఆ తర్వాత నుండి ఇప్పటి వరకూ ఆలీ లేకుండా పవన్ సినిమా లేదు. చాలాసార్లు 'పవన్, ఆలీ నా గుండెకాయ ఆలీ లేకుండా నా సినిమా ఉండదు' అని కూడా చెప్పారు. అయితే బుల్లితెర ప్రోగ్రాం 'ఆలీతో జాలీగా'కి గెస్ట్స్ గా వచ్చిన 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' టీంలో సాయిధరమ్ తేజ్ ఆలీని చిరంజీవి, పవన్ కళ్యాణ్ లలో ఎవరంటే మీకు బాగా ఇష్టం అని అడిగితే ఆలీ చిరంజీవిగారంటేనే బాగా ఇష్టం అని చెప్పాడు. ఎందుకంటే ఆయన ద్వారానే నాకు పవన్ కళ్యాణ్ పరిచయం అయ్యాడు అని తనదైన శైలిలో ఇద్దరి పైనా ప్రేమను చాటుకున్నాడు.

English summary

First meeting between Ali and Pawan Kalyan