ఆర్మీలో మొదటి ట్రాన్స్ జెండర్ గా రికార్డుకెక్కిన అలెన్!

First transgender in British army

04:15 PM ON 19th September, 2016 By Mirchi Vilas

First transgender in British army

వింతలూ విశేషాలూ సైన్యాన్ని కూడా తాకుతున్నాయి. తాజాగా బ్రిటీష్ ఆర్మీలో ఓ ఘటన వెలుగుచూసింది. అక్కడి ఆర్మీలో పనిచేస్తున్న గార్డ్స్మన్ క్లో అలెన్(24) ఇప్పుడు ఒక్కసారిగా చరిత్రకెక్కింది. ఆమె పేరు ప్రపంచవ్యాప్తమైంది. అందుకు కారణం ఆమె ట్రాన్స్ జెండర్ కావడమే. నాలుగేళ్ల క్రితం బ్రిటిష్ ఆర్మీలో చేరిన బెన్ ఇప్పుడు మహిళగా మారింది. అధికారికంగా తన పేరును అలెన్ గా మార్చుకుంది. తాను మహిళగా మారేందుకు హార్మోన్ థెరపీ చేయించుకుంటున్నట్టు అధికారులకు చెప్పానని, దానికి వారు అంగీకరించినట్టు అలెన్ పేర్కొంది. దీంతో బ్రిటిష్ పదాతి సైన్యంలో సేవలు అందిస్తున్న తొలి ట్రాన్స్ జెండర్ గా అలెన్ రికార్డు సొంతం చేసుకుంది.

ప్రజలు తనను చూసి స్ఫూర్తి పొందేలా చేశానని చేసినందుకు గర్వంగా ఉందని అలెన్ పేర్కొంది. తాను ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు తల్లి దుస్తులు ధరించి ఆనందించే దానినని పేర్కొంది. అయితే ఆ సమయంలో తన భావోద్వేగాలను అదుపుచేసుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చేదని తెలిపింది. యుద్ధరంగంలో మహిళలకు కూడా చోటు కల్పించాలంటూ జనరల్ సర్ నిక్ కార్టెర్ జూలైలో అప్పటి ప్రధాని డేవిడ్ కేమరూన్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన అంగీకరించారు. దీంతో అలెన్ మహిళగా మారడానికి మార్గం సుగమమైంది. ట్రాన్స్ జెండర్ గా యద్ధరంగంలో సేవలు అందించే భాగ్యం రావడంతో తనకు ఎంతో ఆనందంగా ఉందని అలెన్ ఉబ్బితబ్బిబ్బయింది.

ఇది కూడా చదవండి: ప్రియుడు ఆచూకీ తెలుసుకోవడం కోసం ఆ అమ్మాయి రోడ్డుపై బట్టలు విప్పేసి..(వీడియో)

ఇది కూడా చదవండి: 5 లక్షల మంది పేదలకు ఇళ్ళు కట్టిస్తున్న స్టార్ హీరో..

ఇది కూడా చదవండి: తన తల్లిని చంపిన హంతకుడ్ని పట్టించిన ఐదేళ్ల చిన్నారి.. ఇందులో ట్విస్ట్ వింటే దిమ్మతిరుగుద్ది!

English summary

First transgender in British army