భారత దేశంలో మొట్టమొదటి  లింగమార్పిడి  సబ్-ఇన్స్పెక్టర్

First Transgender Sub-Inspector

07:16 PM ON 12th November, 2015 By Mirchi Vilas

First Transgender Sub-Inspector

ఇటీవల లింగమార్పిడి అనేది సర్వ సాధారణం గా మారింది. వీరినే ట్రాన్స్ జెండర్స్ గా పిలుస్తుంటారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో వీరి పట్ల వివక్ష కాస్త ఎక్కువనే చెప్పాలి . అలాంటిది ప్రితిక యశిని అనే ట్రాన్స్ జెండర్ ఏకంగా సబ్-ఇన్స్పెక్టర్ అయ్యి అందరిని ఆశ్చర్య పరచింది.

వివరాల్లోకి వెళ్తే ట్రాన్స్ జెండర్స్ ను గుర్తించి వాళ్ళు ఎదుర్కుంటున్న సమస్యలను గుర్తించడంలో తమిళనాడు రాష్ట్రం ఎప్పుడూ ముందుంటుంది. తమిళనాడు రాష్ట్రంలో 30,000 ట్రాన్స్ జెండర్స్ ఉంటారు వీళ్ళందరి కోసం ఉచిత ఇల్లు , ఉచిత విద్య వంటి అనేక పధకాలు తమిళనాడు ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.

అంత తేలిగ్గా సాగలేదు :

తమిళనాడుకు చెందిన ప్రితిక యశిని అనే ట్రాన్స్ జెండర్ పోలీస్ శాఖలో సబ్-ఇన్స్పెక్టర్ పోస్ట్ కు అప్లికేషన్ పెట్టింది. అయితే మూడో లింగధారణ వారికి అనుమతి లేదని ఇంకా సరైన పత్రాలు లేవన్న సాకుతో ఆమె పెట్టుకున్న అప్లికేషన్ను రాష్ట్ర పోలీస్ డిపార్టుమెంటు వారు తిరస్కరించారు. దీంతో ఆమె ఏ మాత్రం నిరాశ చెందకుండా తన అభ్యర్ధనను కోర్టు ముందుచింది. కోర్టు లో వరుసగా అనేక పిటీషన్లు వెయ్యడంతో ఆమె పోలీసు శాఖ వారికి పెట్టుకున్న అప్లికేషన్ను మళ్ళి పరిగణలోకి తీసుకోమని కోర్టు ఆదేశించడంతో పోలీస్ కావాలన్న ఆమె కలను సాకారం చేసుకుంది . దీంతో ప్రితిక ఇండియాలో మొట్ట మొదటి ట్రాన్స్ జెండర్ సబ్-ఇన్స్పెక్టర్ గా రికార్డుల్లోకి ఎక్కింది . ఈ విజయంతో ప్రితిక తన వంటి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.

English summary

First Transgender Sub-Inspector