సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లకు ఏం దొరికిందో తెలుసా?

Fish hunters got shocking thing in their net

12:29 PM ON 27th July, 2016 By Mirchi Vilas

Fish hunters got shocking thing in their net

మాములుగా జాలర్లకు వలలో చేపలు పడటం సహజం, మరీ అనుకుంటే అక్కడ ఉన్న చెత్తాచెదారం వలలో పడటం సహజం. కానీ ఆ జాలర్లకు ఆశ్చర్యపోయేదొకటి వలలో పడింది. ఆ వివరాల్లోకి వెళితే.. మనల్ మేల్ కుడి కృష్ఱరాజపట్టినం చేపలరేవు నుంచి ఆదివారం రాత్రి సుమారు 200 మంది జాలర్లు నాటుపడవలలో చేపలవేటకు వెళ్లారు. 10నాటికల్ మైళ్ల దూరంలో ఓ నాటుపడవలో రాజా మహమ్మద్, సుల్తాన అనే ఇద్దరు జాలర్లు సముద్రంలో చేపలవేట కోసం వలను విసిరారు. కాసేపటికి ఆ వలలో చాలా బరువైన వస్తువేదో పడినట్లు కనుగొన్నారు. ఇద్దరు జాలర్లు అతికష్టం మీద వలను లాగి చూడగా అందులో ఓ ఎరుపు రంగు 'పల్సర్' మోటారు బైకు కనిపించింది.

ఆ జాలర్లు బైకును పడవలో వేసుకుని తీరానికి చేర్చారు. వెంటనే ఆ జాలర్లు 1093 నెంబర్ కు ఫోన్ చేసి సముద్రతీర భద్రతాదళం అధికారులకు ఫిర్యాదు చేశారు. సముద్రతీర భద్రతాదళం సబ్ ఇనస్పెక్టర్ జవహర్ ఇతర పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. ఆ బైకుకు నెంబర్ ప్లేటు లేదని తెలుసుకున్నారు. తీవ్రవాదులెవరైనా ఆ బైకును అక్రమ రవాణా కోసం తీసుకువచ్చి తీరంలో గస్తీదళాల నిఘా ఎక్కువగా ఉండటంతో సముద్రంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

English summary

Fish hunters got shocking thing in their net