నింగి నుంచి చేపల వాన..

Fish rain in west godavari

10:47 AM ON 10th June, 2016 By Mirchi Vilas

Fish rain in west godavari

సాధారణంగా వడగళ్ళ కురుస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి చేపల వర్షం కురిసింది. ఓ వైపు సుడిగాలులు బీభత్సం సృష్టించగా, మరోవైపు ఆకాశం నుంచి చేపలు పడటంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రజలు చేపలను ఏరుకున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లో చేపల వర్షం కురిసింది. పాశ్చాత్య దేశాల్లో టోర్నడోలు బీభత్సం సృష్టించడం మనకు తెలిసిందే. అలాంటి టోర్నడోలు ఇప్పుడు ఏపీలోను అప్పడప్పుడు కనిపిస్తున్నాయి. టోర్నడోల తరహా కాకపోయినా ఏపీలో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. వీటిని చూసి జనాలు భయాందోళనకు గురవుతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని కొల్లేరులో భారీగా సుడిగాలులు వచ్చాయి. దీంతో, నీటితో పాటు చెరువులోని చేపలు కూడా పెద్ద ఎత్తున పైకి ఎగిరి పడ్డాయి. అంతేకాదు, చేపల చెరువుల మధ్య సుడులు తిరుగుతున్న నీళ్లు ఎగిరి గట్ల పైన ఉన్న కొబ్బరిచెట్లను ఎత్తి పడేశాయి. ఈ గాలులకు, నీటి తాకిడికి కొబ్బరి చెట్లు కూలాయి, చేపలు ఎగిరిపడ్డాయి. కాగా, అంతకుముందు కొల్లేరులో వచ్చిన భారీ సుడిగాలి ఇంటర్నెట్లో ఇప్పటికే హల్ చల్ చేస్తోంది. మళ్ళీ మరోసారి చోటుచేసుకుంది. అదండీ సంగతి...

English summary

Fish rain in west godavari