చేపల వేటకు వెళ్తే ..670 కోట్లు విలువ చేసే ముత్యం దొరికింది.. కానీ..

Fisherman found giant pearl worth 670 crores in Philippines

05:18 PM ON 23rd August, 2016 By Mirchi Vilas

Fisherman found giant pearl worth 670 crores in Philippines

దేవుడు కరుణించినా పూజారి కరుణించనట్లు అనే సామెత ఈ జాలరికి సరిగ్గా సరిపోతుంది. రోజులాగే చేపలవేట కోసం వెళ్లిన ఆ జాలరికి 670 కోట్లు విలువ చేసే పెద్ద ముత్యం ఒకటి దొరికింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. ఫిలిప్పీన్స్ కు చెందిన ఒక మత్స్యకారుడు 2006లో పాలవాన్ ద్వీపంలో చేపల వేటకు వెళ్లిన సందర్భంలో పడవకు లంగరు వేస్తుండగా ఒక పెద్ద రాయి అడ్డుపడింది. అయితే అది.. తెల్లగా, వింత ఆకృతిలో ఆకర్షించే విధంగా ఉండటంతో దానిని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంటికి వెళ్లిన తర్వాత తాను పడుకునే మంచం కింద పెట్టుకుని మరచిపోయాడు.

1/4 Pages

అయితే.. ఈ క్రమంలో ఒక రోజు ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఇంట్లో సామానులన్నీ బయట పడేస్తున్న సమయంలో ఆ రాయి బయటపడింది. అయితే, అప్పటికే దీని సంగతి మర్చిపోయిన సదరు మత్స్యకారుడి దృష్టి దీనిపై పడి.. ఆ రాయిని తీసుకొని వెళ్లి స్థానిక టూరిజం అధికారులకు చూపించాడు. దానికి ఫొటో తీసి.. దానిని సామాజిక మాధ్యమాల్లో అధికారులు పోస్ట్ చేశారు. అది రాయి కాదని, ముత్యం కావచ్చని ఈ సందర్భంగా వారికి తెలిసింది. ఆ తర్వాత దానిని పరీక్షించి చూడగా అత్యంత అరుదుగా లభించే ముత్యమని స్పష్టం అయింది.

English summary

Fisherman found giant pearl worth 670 crores in Philippines.