గంగానదిలో దర్శనమిచ్చిన కరెన్సీ నోట్లు!

Fisherman found old 500 and 1000 notes in Ganga river

11:27 AM ON 12th November, 2016 By Mirchi Vilas

Fisherman found old 500 and 1000 notes in Ganga river

నదిలో చేపలు పడుతున్న సమయంలో గాలానికి చేపలు కాకుండా కరెన్సీ నోట్లు చిక్కితే ఇక ఎలా ఉంటుందో వర్ణనాతీతం. ఎందుకంటే, ఇక ఆ చేపలు పట్టేవాడి పంట పండినట్టే. అయితే ఆనోట్లు ఇటీవల నిషేధించిన రూ. 500, రూ.1000 నోట్లు కావడంతో ఖంగు తిన్నాడు. ఈ ఘటన అసలు విషయంలోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో గంగానదిలో స్నానానికి దిగిన పలువురికి నీళ్లల్లో కొట్టుకు వస్తున్న రూ.500, రూ.1000 నోట్లు కనిపించాయి. ఆశ్చర్యానికి గురైన వారు ఆ నోట్లను సేకరించి పోలీసులకు సమాచారమందించారు. దీంతో ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున జనం చేరుకున్నారు.

పోలీసులు కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకొని ఈ ఘటనపై విచారణ చేపట్టారు. నల్లధనం నియంత్రించడానికి ప్రధాని నరేంద్ర మోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న సంచలన నిర్ణయంతో పెద్దమొత్తంలో అక్రమ సొమ్ము కలిగి ఉన్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పలువురు అక్రమార్కులు ఇలా నోట్లను పారేస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న పుణె నగరంలోని ఓ చెత్తకుండీలో 52 వెయ్యి రూపాయల నోట్లు దొరికాయి. యూపీలోని బరేలీ ప్రాంతంలో కాలిన, చిరిగిన నోట్లు లభించాయి. ఇప్పుడు తాజాగా గంగా నదిలో ఈ నోట్లు పెద్దసంఖ్యలో లభ్యమయ్యాయి. ఇంకా ఎలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయో చూడాలి.

English summary

Fisherman found old 500 and 1000 notes in Ganga river