ఫిట్‌బిట్‌ నుంచి బ్లేజ్‌ స్మార్ట్ వాచ్..

Fitbit Blaze Fitness Smartwatch

04:34 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Fitbit Blaze Fitness Smartwatch

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ ఫిట్‌బిట్‌ మరో స్పెషల్ వస్తువును మార్కెట్ లోకి తెచ్చింది. ఫిట్ బిట్ బ్లేజ్ పేరిట మరో ఫిట్‌నెస్‌ స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. జనవరిలో జరిగిన సీఈఎస్‌ 2016లో ఫిట్‌బిట్‌ ఈ స్మార్ట్‌వాచ్‌ను ప్రదర్శించింది. దీనిని రూ.19,999. దీనిని తాజాగా మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. దీనిని ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఫిట్ బిట్ బ్లేజ్ ప్రస్తుతం నలుపు, నీలం రంగుల్లో లభ్యమవుతోంది. ఫిట్‌బిట్‌ బ్లేజ్‌ ఫిట్‌బిట్‌ యాప్‌కు అనుసంధానమై ఉంటుంది. ఇది క్యాలెండర్‌ అపాయింట్‌మెంట్స్‌, కాల్స్‌, మెసేజెస్‌ చూపిస్తుంది. డిస్‌ప్లేపై కనిపించే నోటిఫికేషన్‌ను తాకడం ద్వారా ఇంటరాక్ట్‌ అవ్వొచ్చు. ఈ ఫిట్‌నెస్‌ స్మార్ట్‌వాచ్‌ ద్వారా ఎన్ని అడుగులు నడిచారో, ఎన్ని కాలరీలు ఖర్చు అయ్యాయో.. తదితర వివరాలు తెలుసుకోవచ్చు.

English summary

Popular electronic Company FitBit launched a new Smartwatch.The price of this smart watch was Rs. 19,999 .This smart watch was available on Amazon website.