10 వేల లోపు 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

Five best smart phones under 10,000

07:41 PM ON 16th November, 2015 By Mirchi Vilas

Five best smart phones under 10,000

ప్రతీరోజు నిత్యం చాలా స్మార్ట్‌ ఫోన్లు మార్కెట్‌లోకి వస్తుంటాయి.అందులోని బెస్ట్‌ ఫోన్లు మీకోసం.

1.లెనోవో కె3.నోట్‌:

10,000 లోపు ఫోన్లలో లెనోవో కె3 నోట్‌ మొదటి స్థానంలో నిలవడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ 5.0 లాలిపాప్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తో పని చేసే ఈ ఫోన్‌లో 2జిబి ర్యామ్‌,1.7జిహెచ్‌ ప్రొపెసర్‌ ఉన్నాయి. 5.5 ఇంచ్ టచ్‌ స్క్రీన్‌తో ఈ ఫోన్‌ అందరికి ఆకట్టుకుంటుంది. వెనుక 13 మెగాపిక్సెల్స్‌ కెమెరా,ఫ్రంట్‌ 5 మెగా పిక్సెల్స్‌ తో అద్భుత మైన ఫోటోలు ఈ ఫోన్‌ అందిస్తుంది.16 జిబి అంతర్గత స్టోరేజ్‌ గల ఈ ఫోన్‌ లో మైక్రో ఎస్ డి కార్డుతో 32 జిబి వరకు మెమొరీని పెంచుకునే సౌలభ్యం ఉంది. 2900 ఎంఎహెచ్‌ బ్యాటరీ,డ్యుయల్‌ సిమ్‌,4జి వంటి ఫీచర్లు అదనపు ఆకర్షణగా చెప్పచ్చు .

2.జోలో బ్లాక్‌ 1 ఎక్స్‌.

జోలో కంపెని ఇటీవల 'బ్లాక్‌ 1 ఎక్స్‌' పేరుతో తన కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసింది.ఆండ్రాయిడ్‌ 5.1 లాలిపాప్‌తో పని చేసే ఈ ఫోన్‌లో 3జిబి ర్యామ్‌,1.3 గిహె మీడియాటెక్‌ ప్రోసెసర్‌ 5 ఇన్‌చెస్‌ స్క్రీన్‌ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఫ్రంట్‌ 5 మెగాపిక్సెల్స్‌ వెనుక 13 మెగాపిక్సెల్స్‌ కెమెరాలతో మంచి ఫోటోలను అందిస్తుంది. డ్యూయల్‌ సిమ్‌,4 జి సపోర్ట్‌తో ఈ ఫోన్‌ లభిస్తుంది. 32 జిబి అంతర్గత మెమొరి,ఎక్సపాండబుల్‌ మెమొరి ద్వారా 128 జిబి వరకు పెంచుకునే సౌలభ్యం ఉంది.2400 ఎంఎహెచ్‌ బ్యాటరీతో మంచి బ్యాకప్‌ను అందిస్తుంది.

3.మైకోమాక్స్‌ యు యురెకా ప్లస్‌:

గతంలో విడుదలైన యు యురెకా కు ఎంత మంచి ఆదరణ లభించిందో తెలిసిందే. దానికి ఆప్‌డేట్‌ గా యు యురెకా ప్లస్‌ను మార్కెట్‌లోకి విదుదల చేసింది మైకోమాక్స్‌ . ఆంద్రాయిడ్‌ 5.1 లాలీపాప్‌ ఆపరేటింగ్‌ సిస్టంతో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్లో 2 జిబి ర్యామ్‌,1.5 గిహె స్నాప్‌డ్రాగన్‌ ప్రొపెసర్‌, 5.5 ఇంచ్ స్క్రీన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.ముందు భాగంలో 5 మెగాపిక్సెల్స్‌ వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్స్‌ కెమెరాలతో కూడిన ఈ ఫోన్‌లో వున్నాయి . 2500 ఎంఎహెచ్‌ బ్యాటరీ,4జి సపోర్ట్ ,16జిబి అంతర్గత మెమోరీ,మైక్రోఎస్‌డి కార్డు ద్వారా 32 జిబి వరకు ఎక్స్‌పాండబుల్‌ మెమోరిని పెంచుకునే సౌలభ్యం వంటివి ప్రత్యేక ఆకర్షణ.

4.కూల్‌ ప్యాడ్‌ నోట్‌ 3 :

10 వేల ధర లోపు ఫోను కొనాలనే వారు పరిగణలోకి తీసుకోవలసిన ఫోన్ల లో కూల్‌ప్యాడ్‌ నోట్‌ 3 కూడా ఒక్కటి . ఆండ్రాాయిడ్‌ 5.1 లాలీపాప్‌ ఆపరేటింగ్‌ సిస్టంతో పనిచేసే ఈ స్మార్‌ ఫోన్లో 3 జిబి ర్యామ్‌,16 జిబి అంతర్గత మెమోరి,వెనుక 13,ఫ్రంట్‌ 5 మెగా పిక్సెల్స్‌ కెమెరాలు , 5.5 ఇంచుల టచ్‌ స్క్రీన్‌, 4 జి సపోర్ట్‌,డ్యూయల్‌సిమ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్ధ్యంతో ఈ ఫోన్‌ లభిస్తుంది.ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ కలిగి ఉండడం ఈ ఫోన్‌ ప్రత్యేకత .

5.అసూస్‌ జెన్‌ ఫోన్‌ 2 లేజర్‌ :

అసూస్‌ స్మార్ట్‌ ఫోన్లకు మార్కెట్‌ మంచి ఆదరణ లభిస్తున్న క్రమంలో అసూస్‌ కంపెని మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను మార్కెట్‌ లోకి విడుదల చేసింది..ఆంద్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టంలో ఈ ఫోన్‌ పనిచేస్తుంది.ఈ ఫోన్లో 2 జిబి ర్యామ్‌,16 జిబి అంతర్గత మెమోరి,128 జీబి వరకు మైక్రోఎస్‌డి కార్డుతో ఎక్సపాండ్‌ చేసుకునే సౌకర్యం ఉంది . వెనుక 13 మెగాపిక్సెల్‌ ముందు 5 మెగాపిక్సెల్‌ కెమెరాతో మంచి ఫోటోలను తీసుకోవచ్చు. వెనుక కెమెరాకు లేజర్‌ టెక్నాలజీని జోడించడంతో చీకటిలో కూడా అధ్బుతమైన ఫోటోలను తీసుకోవచ్చు.3000 ఎంఎహెచ్‌ బ్యాటరీతో ఈ ఫొన్‌ లభిస్తుంది. 4 జి సపోర్ట్‌,లేజర్‌ ఆటోఫొకస్‌ కెమెరా ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణ.

English summary

Five best smart phones under 10,000