భారతీయుల కోసం ఐదు డేటింగ్ యాప్స్..

Five dating apps for Indians

12:40 PM ON 26th March, 2016 By Mirchi Vilas

Five dating apps for Indians

ఒంటరి జీవితం బోర్ కొడుతోందా.. ఎవరైనా తోడుగా ఉంటే బాగుండేది అనిపిస్తోందా.. డేటింగ్ కు ఎవరైనా దొరికితే బాగుండును అనిపిస్తోందా.. అయితే మీరు మీ ఫస్ట్ డేట్ ను ఈజీగా సాధించవచ్చు. ఇందు కోసం మీ ఫ్రెండ్ ను రిక్వస్ట్ చేయనక్కర్లేదు. లేదా వారి ద్వారా కొందరికి ప్రపోజ్ చేయనవసరం లేదు. సింపుల్ గా మీ స్మార్ట్ ఫోన్ లో ఓ యాప్ ఇన్ స్టాల్ చేసుకుంటే చాలు.. మీకు డేట్ దొరికేస్తుంది. ప్రస్తుతం చాలా డేటింగ్ యాప్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో భారతీయులను ప్రత్యేకంగా కొన్ని యాప్స్ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. మీ లాగే ఆలోచించే వ్యక్తిని మీ చుట్టు పక్కలే ఉంటే ఈజీగా పట్టుకోవడానికి ఈ యాప్స్ ఎంతో దోహదం చేస్తాయి. తొలుత యాప్ లో సైన్ అప్ కావడం ఆ తర్వాత కొన్ని వివరాలు ఇవ్వడం అంతే చాలు మీ డేట్ కోసం మిగతా పనిని ఆ యాప్ లే కానిచ్చేస్తాయి. అయితే మీ డేట్ కు ఉపయోగపడే ఐదు డేటింగ్ యాప్స్ ను షార్ట్ లిస్ట్ చేసి మీకు అందిస్తున్నాం.. అవేంటో ఓ లుక్కేయండి..

ఐ లవ్ యూ చెప్పడానికి ఎంత కాలం ఆగాలి..?

హోలీ పండుగ వెనుక ఆసక్తికరమైన కధలు

ప్రేమ గురించి మీకు తెలియని 6 నిజాలు ఇవే..

1/6 Pages

టిండర్(Tinder)

అమెరికాలో ఈ యాప్ బాగా పాపులర్. సెలెబ్రిటీలు కూడా క్యాజువల్ డేటింగ్ కోసం ఈ యాప్ నే వాడుతుంటారు. దీని ఇండియన్ వెర్షన్ కూడా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది. ఒకసారి మీరు దీనిని డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత మీకు అందులో మీకు దగ్గరలో ఉన్న కొందరు వ్యక్తుల ప్రొఫైల్స్ కనిపిస్తాయి. ఆ ప్రొఫైల్ లో ఐదు ఫొటోలు కూడా ఉంటాయి. అలాగే వారి ఇష్టాయిస్టాలు.. అభిరుచులు కొన్ని కూడా కనిపిస్తాయి. అవి మీకు ఆసక్తికరంగా అనిపిస్తే మీరు ఆ ప్రొఫైల్ ని లైక్ కొట్ట వచ్చు. ఒక వేళ వారికి మీరు నచ్చితే మిమ్మల్ని లైక్ చేస్తారు. అప్పుడు యాప్ లోనే చాటింగ్ ప్రారంభించవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ ఫోన్లలో అందుబాటులో ఉంది.

English summary

Here are listed about dating apps for Indians. If you don’t want to spend it alone, you still have a chance to get a date. all you need is a smartphone.