విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం

Five Members Died In An Accident In Vijayawada

09:45 AM ON 15th March, 2016 By Mirchi Vilas

Five Members Died In An Accident In Vijayawada

విజయవాడలో ప్రైవేటు బస్సు చెట్టుకు ఢీకొట్టి, బోల్తా పడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం 5గురిని బలిగొంది. ఇందులో నలుగురు వైద్య విద్యార్ధులు , ఓ డ్రైవర్ వున్నారు. మరో 20 మంది మెడికోలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌ వెళ్లే జాతీయ రహదారిపై గొల్లపూడి పరిధిలోని నల్లకుంట సెంటర్‌ వద్ద సోమవారం రాత్రి 11 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌ ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, బస్సు డ్రైవరు దుర్మరణం పాలయ్యారు. అతి వేగంగా వచ్చిన బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొని బోల్తా పడింది.

1/6 Pages

మద్యం మత్తే కారణం .... 

    డ్రైవర్‌ మద్యం మత్తులో అతి వేగంగా బస్సు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. మద్యం మత్తులో బస్సు నడపొద్దని అభ్యంతరం చెప్పిన తమతో గొడవపడి డ్రైవర్‌, వేగంగా వెళుతూ బస్సును హఠాత్తుగా ఒక పక్కకు తిప్పి ప్రమాదానికి కారణం అయ్యాడని విద్యార్థులు అంటున్నారు.

English summary

Five Medical Students from Osmania university were died in a road accident in Nallakunta near to Vijayawada. This accident was occured because of the bus driver drank alcohol and Drives the bus.Telangana Chief Minister KCR also felt sad by knowing about this incident.