తెలంగాణాలో రోజుకిక అయిదు షోలు

Five Shows In Telangana Theaters

11:56 AM ON 16th May, 2016 By Mirchi Vilas

Five Shows In Telangana Theaters

అవునా అంటే అవునని సంకేతాలు వచ్చాయి. తెలంగాణలో చిన్న సినిమా నిర్మాతలకు ఇది నిజంగా గుడ్ న్యూస్. రాష్ట్రంలోని థియేటర్లలో ఇకపై ప్రతిరోజూ 5 షోలను అనుమతించాలన్న ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. సిఎమ్ కెసిఆర్ ఈ మేరకు ఆమోద ముద్ర వేయబోతున్నారు. చిన్న మూవీలను ప్రోత్సహిస్తూనే.. మూడు గంటలకన్నా తక్కువ నిడివి ఉన్న సినిమాలను ప్రదర్శించాలనే నిబంధనను సడలించాలని, రోజుకు 5 షోలు ప్రదర్శించేందుకు థియేటర్లకు పర్మిషన్ ఇవ్వాలని సర్కార్ యోచిస్తోంది. ఇది అమల్లోకి వస్తే.. సినిమా హాళ్ళలో మార్నింగ్ షోలు ఇప్పటిలా ఉదయం 11 లేదా 11.30 గంటల మాదిరి కాక ఉదయం 10 గంటలకే మొదలవుతాయి. మ్యాట్నీ షో మధ్యాహ్నం ఒంటిగంటకు, సాయంత్రం షోలు 4 గంటలకు, రాత్రి తిరిగి 7, సెకండ్ షో రాత్రి 10 గంటలకు మొదలవుతాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లు రాత్రి 12:30 గంటలకల్లా క్లోజ్ కావలసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:బన్నీ మళ్ళీ ఫైర్ అయ్యాడు

ఇవి కూడా చదవండి:ఆ పనులు చేసే దానిలా కనిపిస్తున్నానా?

ఇవి కూడా చదవండి:యూట్యూబ్‌లో సరికొత్త ఫీచర్‌ 'చాటింగ్'

English summary

Government Of Telangana State was planning to give permission for Five shows in Telangana Movie Theaters. Due to this theaters So many Small Films have got chance to screen their movie in theaters.