ఫ్లాష్ కీబోర్డ్ యాప్..!

Flash Keyboard App

01:27 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Flash Keyboard App

చాటింగ్.. చాటింగ్.. చాటింగ్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే. మెసేజింగ్ యాప్ ఏదైనా అందరూ ఎల్లప్పుడూ చాటింగ్‌తో బిజీ.. బిజీ.. మెసేజ్‌లే కాదు తమ మూడ్‌లకు అనుగుణంగా వివిధ రకాల స్టిక్కర్లు, ఎమోజీలను షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు మరిన్ని స్టిక్కర్లు, ఎమోజీలను అందించే కొత్త యాప్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఫ్లాష్ కీబోర్డ్ పేరిట గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్న ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ 4.0 ఆపైన వెర్షన్ కలిగిన యూజర్లు తమ డివైస్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇది ఎన్నో రకాల స్కిన్స్, ఎమోటికాన్స్, ఎమోజీస్, స్టిక్కర్లను యూజర్లకు అందిస్తోంది. దీంతో మెసేజ్‌ల టైపింగ్‌లో చక్కని వినోదం లభిస్తుంది. దాదాపు 400కు పైగా ఎమోజీలు, స్మైలీస్ ఇందులో ఉన్నాయి. దాదాపు అన్ని రకాల ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్స్‌లోనూ ఈ ఎమోజీలు, స్మైలీలు, స్టిక్కర్లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ యాప్‌కు చెందిన సర్వర్‌కు కనెక్ట్ అవడం ద్వారా మరిన్ని స్టిక్కర్లను డౌన్‌లోడ్ చేసుకునే వీలు కల్పించారు. యూజర్లు తమ ఇష్టాలకు అనుగుణంగా సొంత స్టిక్కర్లను కూడా దీంట్లో క్రియేట్ చేసుకోవచ్చు.

English summary

A new key board app named Flash Keyboard app attracts the users by its new features.this Flash keyboard is a fast Android keyboard with multi-language support, skins,emoticons, emoji,stickers,and you could even make your own unique sticker