ఆన్లైన్ లో  250 కోట్లు విలువగల ఫాట్ల అమ్మిన హౌసింగ్.కామ్

Flats worth Rs 250 crore booked in Housing.com

06:59 PM ON 20th November, 2015 By Mirchi Vilas

Flats worth Rs 250 crore booked in Housing.com

ప్రయుఖ రియల్ ఎస్టేట్ సంస్థ హౌసింగ్.కామ్ వారు దీపావళి సందర్భంగా 250 కోట్ల విలువైన ప్లాట్లను ఆన్ లైన్ లో విక్రయించినట్లు తెలిపారు.

10 లక్షల నుండి 25 కోట్లు విలువైన దాదాపు లక్ష ఫ్లాట్లను వివధ డిస్కౌంట్ లతో అక్టోబర్ 29 నుండి నవంబర్ 22 వరకు జరిగే ప్రాపర్టీ ఎక్స్ప్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గత వారం ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థ స్నాప్ డీల్ వారు తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 10,000 మంది కస్టమర్లు పండుగ సమయంలో ఆస్తుల కొనుగోలుకు నమోదు చేసుకున్నారని తెలిపింది.

అక్షరాల 250 కోట్లు విలువగల ఆస్తులు ఇప్పటికే అమ్ముడయ్యాయని తెలిపారు. ఈ వేదిక పై ఇప్పటి వరకు బుక్ చేసుకున్న ఇళ్ళ సగటు విలువ 80 లక్షలు అని హౌసింగ్.కామ్ వారు తెలిపారు. 150 మంది డెవలపర్లు , మొత్తం 400 ప్రాజెక్ట్ లను ఈ ఎక్స్ప్లో లో పాలుపంచుకున్నాయి.

ప్రముఖ డెవలపర్ లైన ప్రెస్టీజ్ గ్రూప్ , గోద్రెజ్,హిరానందని, మహీంద్రా ఎటిఎస్, జేపి గ్రీన్, కల్పతరు, డిబి రియాల్టీ రేడియస్ ,నిర్మల్ లైఫ్ స్టైల్ , దోస్తి రియాలిటీ వంటి కంపెనీలు ఈ ఎక్స్పోలో పాల్గొన్నాయి.

ముఖ్యంగా భారత్ నుండే కాక యూఎస్,యుకే, యూఏఈ వంటి దేశాలనుండి కూడా వివిధ కస్టమర్లను ఈ ఎక్స్పో ఆకర్షించిందనే చెప్పాలి.

English summary

Realty portal Housing.com today said properties worth Rs 250 crore have been sold during its online sale this Diwali.