ఈ ఫోన్ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో సంచలనమే!

Flex Phone That Molds As You Do

11:13 AM ON 11th January, 2017 By Mirchi Vilas

Flex Phone That Molds As You Do

ఇప్పుడు ఇంచుమించు సెల్ ఫోన్ కాదు, అందునా స్మార్ట్ ఫోన్ అందరిచేతిలో దర్శనమిస్తోంది. పైగా ఆర్ధిక లావాదేవీలన్నీ డిజిటల్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో స్మార్ట్ ఫోన్ హవా మరింత హెచ్చనుంది. ఇక స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి త్వరలో 'ఈ ఫోన్' రాబోతోంది. ఇది ఈ రంగంలోనే పెను సంచలనం కానుందని అంటున్నారు. అమెరికాకు చెందిన కంపెనీ దీనిని అభివృద్ధి చేసింది.

అమెరికాకు చెందిన రాయల్ కార్పొరేషన్ ఈ ‘ఫ్లెక్స్ ఫోన్’ను అభివృద్ధి చేసింది. దీనిని ఫిట్ నెస్ ట్రాకర్ గా ఉపయోగించుకోవచ్చు. అనారోగ్యంగా ఉన్నప్పుడు గుండె కొట్టుకునే వేగాన్ని తెలుసుకోవచ్చు. ప్రయాణంలో ఉన్నప్పుడు దూరాన్ని కొలిచేందుకు వాడుకోవచ్చు. దీని బరువెంతో తెలుసా? ఆరు మిల్లీమీటర్ల మందం ఉండే ‘ఫ్లెక్స్ ఫోన్’ బరువు కేవలం వంద గ్రాములు. అంతేకాదు రెండు డిస్ల్పేలు ఉండడం ఈ ఫోన్ కున్న మరో ప్రత్యేకత. పొరపాటున చేజారినా పగిలిపోయే ప్రమాదం తక్కువ. ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంపై పనిచేసే ఈ ఫోన్ 3జీని సపోర్ట్ చేస్తుంది. సింగిల్ సిమ్ కార్డును వేసుకోవచ్చని రాయల్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో బిల్ లియు చెబుతున్నారు.

'ఈ ఫోన్ 'ను మనం ఎలా కావాలనుకుంటే అలా వాడుకోవచ్చట. ఎలాగంటే, దీనిని మడతపెట్టుకుని జేబులో పెట్టుకోవచ్చు. లేదంటే ప్రస్తుతం ఉన్న ఫోన్ లా వాడుకోవచ్చు. అదీ కాదంటే ఎంచక్కా రిస్ట్ వాచ్ లా మణికట్టుకు చుట్టేసుకోవచ్చ ట. కాల్ వచ్చినప్పుడు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుకోవచ్చు. లేదంటే దానిని తీసి చెవి దగ్గర పెట్టుకుని స్మార్ట్ ఫోన్ లా మాట్లాడుకోవచ్చు. తర్వాత మళ్లీ దీనిని చేతికి చుట్టేసుకోవచ్చట.

ఇవి కూడా చదవండి: ప్రియురాలి భర్తకు విషపు ఇంజక్షన్ ... ఎందుకో తెలిస్తే షాకవుతారు

ఇవి కూడా చదవండి:వామ్మో .. వేలంలో 3 టికెట్లు.. రూ.36 లక్షలట

English summary

A New Smartphone was going to be launched by American company and this smart phone was named as FLWX PHONE and by using this flex phone the user can use it as watch and we can fold and we can put it in our pockets also.