రన్ వేపై ఒరిగిపోయిన ఫ్లైట్

Flight Rolls On Runway

06:27 PM ON 16th December, 2015 By Mirchi Vilas

Flight Rolls On Runway

అమెరికాలో ఓ విమానం రన్ వే పై నుంచి పక్కకి ఒరిగిపోయింది. వాషింగ్టన్ లో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఎనిమిది మంది గాయాల పాలయ్యారు. విమానం ల్యాండవుతుండగా రన్‌వేపై నుంచి పూర్తిగా పక్కకు ఒరిగిపోయింది. సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన బోయింగ్ 737 ఫ్లైట్‌-31 విమానం టెక్సాస్‌లోని హూస్టన్‌ హాబీ విమానాశ్రయం నుంచి బయలుదేరి వాషింగ్టన్‌లోని నాష్‌వీల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది. విమానం ల్యాండ్ అవుతుంగా ఒక్కసారిగా రన్ వేపై నుంచి పక్కకి వెళ్లిపోయింది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి గాయపడిన వారిని విమానాశ్రయంలోని మెడికల్‌ సెంటర్‌కి తరలించి చికిత్స అందించారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 133 మంది ప్రయాణికులతో పాటు ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. విమానం ఒక్కసారిగా పక్కకి వెళ్లిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే అంతా సురక్షితంగా ఉండటంతో వారు ఊపిరిపీల్చుకున్నారు.

English summary

A Southwest Airlines flight rolled and got stuck after landing Tuesday at Nashville International Airport, said a spokeswoman with the Federal Aviation Administration