444 రూపాయలకే విమాన టికెట్!

Flight ticket for only 444 rupees

03:38 PM ON 22nd June, 2016 By Mirchi Vilas

Flight ticket for only 444 rupees

అవును మీరు విన్నది నిజమే! 444 రూపాయలకే విమాన టికెట్ మీకోసం అందిస్తున్నారు. ఆలస్యం ఎందుకింకా త్వరగా త్వరపడండి. అయితే ఏ విమానాలకు మాత్రమే ఇది చెందుతుందో తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. దేశీయ విమానయాన సంస్థలు పోటీ ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణికులను ఆకర్శిస్తున్నాయి. ఈ జాబితాలో ముందుండే ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ తాజాగా మాన్ సూన్ బొనాంజా సేల్ పేరుతో డొమెస్టిక్ విమాన టికెట్ల పై పలు ఆఫర్లను ప్రకటించింది. జమ్మూ నుంచి శ్రీనగర్, అహ్మదాబాద్ - ముంబై, గోవా- ముంబై, ఢిల్లీ- డెహ్రాడూన్ మరియు ఢిల్లీ- అమృతసర్ రూట్లలో ప్రారంభ విమాన టికెట్ ధర రూ. 444 మాత్రమేనని పేర్కొంది.

మిగతా రూట్లలో మాత్రం ప్రయాణ దూరాన్ని బట్టి ఛార్జీలు వేరుగా ఉంటాయని తెలిపింది. ఈ అవకాశం ఈరోజు నుంచి జూన్ 26 లోపు బుక్ చేసుకున్నవారికి మాత్రమే. టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నవారు ఈ ఏడాది జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. ఫస్ట్ కమ్ - ఫస్ట్ సర్వ్ విధానంలో సీట్లు కేటాయించనుంది.

English summary

Flight ticket for only 444 rupees