ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ ఎక్చ్సేంజ్‌ డేస్‌

Flipkart Big Exchange Days

10:05 AM ON 2nd February, 2016 By Mirchi Vilas

Flipkart Big Exchange Days

ప్రముఖ ఆన్‌లైన్‌ వెబైసైట్ ఫ్లిప్‌కార్ట్‌ సరికొత్త ఆఫర్ ని ప్రకటించింది. బిగ్‌ ఎక్చ్సేంజ్‌ డేస్‌ పేరుతో ఈ ఆఫర్ ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్‌ ఇకపై ప్రతి నెలా ఒకటి, రెండు తేదీల్లో ఉంటుందని వెల్లడించింది. మొబైల్స్‌, టీవీలు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మిషన్‌లు.. తదితర అనేక వస్తువులకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని చెప్పింది. వినియోగదారుల వద్ద ఉన్న పాత వస్తువుల్ని ఇచ్చి తగ్గింపు ధరతో కొత్త వస్తువులు పొందవచ్చునని వెల్లడించింది. ఈ విధంగా ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ని వినియోగదారుల గడప వద్దకు తీసుకెళ్లిన ఘనత తమకే దక్కుతుందని తెలిపింది. తమ డెలివరీ బాయ్‌లందరికీ ఈ విధానం అర్థమయ్యేలా, పాత వస్తువుల నాణ్యతని అంచనావేసేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు చెప్పింది. ఈ ఆఫర్‌ ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌, ఫ్లిప్‌కార్ట్‌ లైట్‌ యాప్‌, డెస్క్‌టాప్‌ సైట్‌ల్లో ఎందులోనైనా అందుబాటులో ఉంటుందని చెప్పింది.

English summary

India's popular online E-Commerce website Flipkart was announced its new 'Big Exchange Days' scheme where consumers can get their old electronic device exchanged and upgrade to a new one. The e-commerce company has also confirmed that the 'Big Exchange Days' will be scheduled on the first two days of every month.