ఫ్లిప్ కార్ట్ నుంచి డిజిటల్ వాలెట్

Flipkart Money Digital Wallet

12:33 PM ON 7th March, 2016 By Mirchi Vilas

Flipkart Money Digital Wallet

దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా డిజిటల్ వాలెట్ యాప్ ను రూపొందించింది. తాజాగా ఫ్లిప్‌కార్ట్ మనీ పేరిట ఈ యాప్ ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఈ యాప్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. త్వరలో వెబ్‌సైట్‌లో కూడా ఫ్లిప్‌కార్ట్ మనీ ఆప్షన్‌ను యూజర్లకు అందించనుంది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ మనీ యాప్ ఐఓఎస్, విండోస్ వెర్షన్‌లను కూడా విడుదల చేయనుంది. పేమెంట్స్ కంపెనీ అయిన ఎఫ్‌ఎక్స్ మార్ట్ భాగస్వామ్యంతో ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు డిజిటల్ వాలెట్ సేవలను ఫ్లిప్‌కార్ట్ మనీ యాప్ ద్వారా అందించనుంది. దీంట్లో యూజర్లు గిఫ్ట్‌కార్డులు, క్రెడిట్, డెబిట్ కార్డుల వంటి పేమెంట్ విధానాలను, వాటి వివరాలను భద్ర పరుచుకోవచ్చు. తమకు కావాలనుకున్నప్పుడు వినియోగించుకోవచ్చు. ఇతర డిజిటల్ వాలెట్ యాప్‌లలానే దీంట్లోనూ క్యాష్ లావాదేవీలపై కొన్ని నిబంధనలను విధించారు. దీంట్లో మనీ బ్యాలెన్స్ రూ.10వేల కన్నా ఎక్కువ ఉండకూడదు. టాప్ అప్స్ కూడా నెలకు రూ.10వేలు మించవద్దు. ఇతర బ్యాంక్‌లకు చేసే లావాదేవీలు రూ.5 వేలను మించరాదు. ఇది గరిష్టంగా నెలకు రూ.25 వేలను మించరాదు.

English summary

India's number one e-commerce site Flipkart has silently launched its wallet - Flipkart Money - powered by payments firm FX Mart on its Android app.