జలదిగ్భంధంలో చిక్కుకున్న  చెన్నై నగరం 

Floods In Chennai

11:15 AM ON 2nd December, 2015 By Mirchi Vilas

Floods In Chennai

తమిళనాడు రాజధాని చెన్నై లో బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెన్నై నగరం నీట మునిగింది. దీంతో చెన్నై నగరం జలదిగ్భంలో చిక్కుకుంది. భారీ వర్షాలకు చెన్నై నగరంలో విద్యుత్‌, మంచినీటి వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

భారీగా కురిసిన వర్షాల వల్ల చెన్నై విమానాశ్రయం కూడా మూత పడింది.చెన్నై వియానాశ్రయం రన్‌వే పైకి వర్షపు నీరు చేరడంతో చెన్నై విమానాశ్రయం మూతపడింది. దీంతో దాదాపు 400 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకున్నారు. దీంతో చెన్నైకు రావల్సిన విమానాలను దారి మళ్ళించి బెంగుళూరుకు తరలిస్తున్నారు. చెన్నై ఎయిర్‌ పోర్టు రన్‌వే పై చేరిన వర్షపు నీరు పూర్తిగా వెళ్ళిపోయేదాకా విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించలేమని అధికారులు చెబుతున్నారు.

ఈ వర్షాల కారణంగా చెన్నై వైపుగా వెళ్ళే 13 ట్రైన్‌లు రద్దుయ్యాయి . రవాణా, సమాచార వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ వర్షాభావ పరిస్థితును తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నారు. చెన్నై నగరం అంతటా సహాయక చర్యలు కోనసాగుతున్నాయి .

స్కూలు, కాలేజీలుతో పాటు పలు సంస్థలు మూతపడ్డాయి. ఆంధ్రా, తెలంగాణలకు చెందిన 500 మంది ఇంజనీరింగ్‌ విద్యార్ధులు ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీలో చిక్కుకున్నారు. చెన్నైలో భారీ వర్షాలకుఅనేక వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రజలు తమ ప్రాణాల్ని అరచేత పట్టుకుని గడుపుతున్నారు. చెన్నై ప్రజలు కూడా తాము చేయగలిగింది చేస్తున్నారు. ప్రజలు తమ ఇంటికి వచ్చే అపరిచితులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు భోజనం,సెల్‌ఫోన్‌ రిచార్జ్‌ వంటి అందిస్తున్నారు.

ఈ వరదల వల్ల చెన్నై కార్పోరేషన్‌ అధికారులు 1070, 1077, వంటి ఎమర్జెన్సీ ఫోన్‌ నంబర్లును విడుదల చేసారు. ఈ సహాయక చర్యలో భారత ఆర్మీ,నేవి కూడా పాల్గొంటుంది. జాతీయ విపత్తు సహాయక కేంద్రం వారు పది టీంలను సహాయక చర్యల కోసం చెన్నై పంపింది.

English summary

Chennai flooded after two days of heavy and continuous rain. Due to rain water on the chennai airport runway the airport remains closed and the flight were turned towards banglore airport, trains have been cancelled and the army and navy is helping rescue stranded people