శీతాకాలంలో మంచి ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Follow these precautions in winter season

10:39 AM ON 1st December, 2016 By Mirchi Vilas

Follow these precautions in winter season

మనకున్న కాలాలు మూడు. అందులో వేసవిలో సూర్యతాపాన్ని తట్టుకోలేక ఎండలు బాబోయ్ ఎండలు అంటాం. పోనీ వర్షా కాలంలో వర్షం కురుస్తుంటే, ఎంత ఎండైనా భరించొచ్చు ఒక చినుకు భరించలేం అంటుంటారు. పోనీ చలికాలం వస్తే, వామ్మో ఎముకలు కొరికే చలి తట్టుకోలేం అని వాపోతుంటారు. ఎవరెన్ని అనుకున్నా అనుకోకపోయినా, ఆయా కాలాల ప్రభావం చూపించి వెళ్లిపోతుంటాయి. ఇక ప్రస్తుతం నడుస్తున్న చలికాలం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను వణికిస్తోంది. ఉత్తరాది నుంచి వీచే శీతలగాలుల ప్రభావం ఒక్కసారిగా పెరగడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ సంఖ్యలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ వ్యాప్తంగా ఏకసంఖ్యలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటీవల లంబసింగిలో నాలుగు, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో ఏడు డిగ్రీ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. డిసెంబర్, జనవరి మాసాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశముందని సూచిస్తున్నారు. మంచు కూడా దట్టంగా కురుస్తోంది. ఏజెన్సీలోని వణికించే చలి, మంచు పర్యాటకులను ఆహ్లాదాన్ని పంచుతున్నప్పటికీ స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బదులకి గురిచేస్తోంది. ప్రస్తుతం గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో చలి తీవ్రతకు చిన్నపిల్లలు, మహిళలు, గర్భిణులు, వృద్ధులు ఆరోగ్యపరంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఉన్నిదుస్తులు వేసుకున్నా.. రగ్గులు కప్పుకున్నా.. చలి మంటలు పెట్టుకున్నా వెన్నులో చలిపుడుతోందని అంటున్నారు. మైదాన ప్రాంతంలో కూడా చలి వణికిస్తోంది. అయితే శీతల వాతావరణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ఓసారి పరిశీలిద్దాం...

1/31 Pages

1. శీతాకాలం మంచులో తడవడం, చల్లగాలుల్లో తిరగడం చేయకూడదు. చిన్నపిల్లలను చల్లగాలుల్లో ఆడుకోనివ్వరాదు.

English summary

Follow these precautions in winter season