మనిషి నూరేళ్లు బ్రతకాలంటే ఇవి పాటించాల్సిందే!

Follow these tips to live more than 100 years

12:25 PM ON 14th July, 2016 By Mirchi Vilas

Follow these tips to live more than 100 years

జన్మించిన వారు మరణించక తప్పదు, మరణించిన వారు జన్మించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆనాడే చెప్పాడు. పుట్టిన ప్రతీ మనిషి చనిపోతాడు. కాకపోతే ఒకరు, ముందు మరొకరు వెనుక అంతే. అయితే త్వరగా చనిపోతే వాడికి దేవుడు అంత వరకే ఆయుష్షు రాశాడు అందుకే చనిపోయాడు అంటారు. అదే ఏ 70 ఏళ్లకో, 80 ఏళ్లకో చనిపోతే వాడికి దేవుడు ఎక్కువ ఆయుష్షు రాశాడు అందుకే ఎక్కువ రోజులు బతికాడు అంటారు. ఈ నేపథ్యంలో ఒక మనిషికి ఆయుష్షు చాలా ముఖ్యమైనది. అయితే ఆయువు అందరికీ ఒకేలా ఉండదు అంటారు, ఇది కొంతవరకు నిజమే, అయితే ఇందులో మన తప్పులు కూడా ఉన్నాయి.

అవేంటంటే పూర్వం రోజుల్లో మోటార్ వాహనాలు ఉండేవి కావు, అందు చేత ఎటువంటి ప్రమాదాలు సంభవించేవి కావు, అందుకే ఎక్కువ మరణాలు ఉండేవి కావు. అయితే నేటి తరంలో ఎన్నో ప్రమాదాలు, పైగా మనం బ్రతుకుతున్నది ఒక కాలుష్య వాతావరణంలో, దీంతో మనిషి నూరేళ్లు బ్రతకాల్సిన వాడు 60 ఏళ్ళు బ్రతికితే గొప్ప విషయం అయిపోయింది. అయితే అప్పుడు మనిషి 100 ఏళ్లకు పైగా బ్రతికే వాడని చెప్పే వారు. అయితే ఇది అబద్ధం కాదు, నిజమే. ఎందుకంటే మనిషి తినే తిండి వల్లే అతని ఆయుష్షు ముడి పడి ఉంటుందట. మనిషి జీవితంలో కొన్ని పద్ధతులను, అలవాట్లను పాటించడం ద్వారా ఆయుష్షును పెంచుకోవచ్చట.

పురాతన కాలంలో భారత్ లో కాశ్మీర్ ప్రాంతం, చైనా, ఆఫ్ఘనిస్తాన్ తదితర ప్రాంతాల్లో 'హుంజాస్' అని పిలవబడే ఓ వర్గానికి చెందిన వారు 145 ఏళ్ల దాకా బతికేవారట. వారికి ఆయుష్షు అంతగా ఉంటుందట. అయితే అలాంటి వారు ఇప్పుడు అతి తక్కువ సంఖ్యలో ఉన్నారనుకోండి. అది వేరే విషయం. కానీ వారు పాటించిన కొన్ని పద్ధతులు, ఆహారపు అలవాట్లు మాత్రం మనకు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని పాటిస్తే మనం కూడా నిండు నూరేళ్లు బతకవచ్చట. అవేమిటో ఇప్పుడు చూద్దాం...

1/10 Pages

9. తృణ ధాన్యాలు: (Pulses)

హుంజాస్ వర్గీయులు ఉదయాన్నే 5.30 గంటలకు నిద్ర లేచేవారట. మధ్యాహ్నం దాకా ఏ ఆహారం తీసుకునే వారు కారట. కానీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉండేవారట. మధ్యాహ్నం పూట తృణ ధాన్యాలు, పప్పులతో కూడిన శాఖాహారాన్ని భుజించే వారట.

English summary

Follow these tips to live more than 100 years