ఇక్కడ బిర్యానీలో ఆ మాంసం కలుపుతున్నారా ?(వీడియో)

Food Inspectors Collecting Samples in Shah House Hotel

11:29 AM ON 14th December, 2016 By Mirchi Vilas

Food Inspectors Collecting Samples in Shah House Hotel

బిర్యాని అనగానే లొట్టలేసుకుని లాగించేస్తారు. ముఖ్యంగా సండే వస్తే, బిర్యాని రుచి చూడందే చాలామందికి రోజు వెళ్ళదు. అయితే ఓ చోట బిర్యానీలో కుక్క మాంసం కలుపుతున్నారని వార్త పొక్కింది. దీనికి సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం వచ్చిన నేపథ్యంలో నగరంలోని రాయదుర్గంలోని షాగౌష్ హోటల్లో అధికారులు తనికీలు నిర్వహించారు. ఈ ఘటనపై ఓ వ్యక్తి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా...తమకు సంబంధంలేదని ఫుడ్ ఇన్స్ పెక్టర్ కు పిర్యాదు చేయాలని చెప్పినట్లుగా సమాచారం. దీంతో ఆ వ్యక్తి సోషల్ మీడియాద్వారా ప్రచారం చేశాడు. దీనిపై స్పందించిన జీహెచ్ఎంసీ హెల్త్ ఆపీసర్స్, ఫుడ్ ఇన్స్ పెక్టర్స్ కలిసి మంగళవారం మధ్యాహ్నం షాగౌష్ హోటల్ కు వచ్చి బిర్యానీ షాంపిల్స్ సేకరించారు. అయితే యాజమాన్యం మాత్రం తమ హోటల్ కు మంచి పేరు ఉందని, తమ పేరు ప్రతిష్టలను దెబ్బతీయడం కోసమే ఎవరో ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. మొత్తానికి కొన్ని నిజమవుతున్నాయి , కొన్ని ఇలా బోగస్ కూడా అవుతున్నాయి. మొత్తానికి అందరూ జాగ్రత్తగా ఉండడం మంచిదని మాత్రం చెప్పక తప్పదు.

ఇవి కూడా చదవండి: శివాజీరావ్ రజనీకాంత్ గా ఎలా అయ్యాడంటే ...

ఇవి కూడా చదవండి: షాకింగ్ న్యూస్ : ముట్టుకోకుండానే 16 మందిని గర్భవతులను చేశాడు..!

English summary

As the news gone viral over the internet that Dog meat was mixing in Biriyani in a Hotel named Shah House in Hyderabad and GHMC food Inspectors came to the hotel and checked everything and they took the samples of the food and taken it for testing.