ఏం తినాలో చెప్పే ‘ఫుడ్ స్విచ్’

Food Switch App Says What To Eat

04:50 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Food Switch App Says What To Eat

ప్రస్తుతం అంతా స్పీడ్ యుగం. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్ర పోయే వరకు అంతా స్పీడే. నిద్రకు.. తిండికి కూడా సమయం కేటాయించలేనంత వేగం పెరిగిపోయింది జీవితంలో. మరి ఇటువంటి టైమ్ లో మంచి తిండి కావాలంటే ఏం చేయాలి. ఇప్పుడు అందరినీ వేధిస్తున్న పెద్ద సమస్య ఇది. ఇప్పుడు దీనికో పరిష్కారం లభించింది. ఒకే ఒక్క యాప్.. ఆరోగ్యంగా ఉండటానికి మీరు ఏం తినొచ్చో.. తినకూడదో చెపుతుంది. నమ్మలేకపోతున్నారా.. అయినా ఇది నిజం కావాలంటే.. మీరే ఫుడ్ స్విచ్ యాప్ ను ఓ సారి వాడి చూడండి.

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి చెందిన జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ వారు 'ఫుడ్‌స్విచ్' పేరిట తెచ్చిన ఈ యాప్‌ను ఇప్పుడు భారతీయులు కూడా వాడుకోచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది అన్ని రకాల ప్యాకెట్ ఫుడ్స్‌పై ఉండే బార్‌కోడ్‌ను స్కాన్ చేసి ఆ ఫుడ్ ఆరోగ్యవంతమైనది అవునో కాదో చెబుతుంది. అంతేకాదు దానికి మార్పిడిగా ఆల్టర్‌నేటివ్ ఫుడ్స్ ఏమున్నాయో తెలియజేస్తుంది. మీరు ఎంచుకున్న ఫుడ్ లో ఫ్యాట్ ఎంత, సాల్ట్ ఎంత, సుగర్ కంటెంట్ ఎంత ఉంది. మొదలైన విషయాలన్నీ ఇది మీకు ఇట్టే చెప్పేస్తుంది. ప్యాక్డ్ ఫుడ్స్‌ను ఎక్కువగా ఆశ్రయించే వారికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని సంబంధిత సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. దీని ద్వారా వినియోగదారులు తాము తినే ఆహారాల్లో ఆరోగ్యవంతమైన వాటిని ఎంపిక చేసుకునేందుకు వీలవుతుందని అన్నారు.

ఒకవేళ మనం ఎంచుకున్న ఆహారం ఫుడ్ స్విచ్ డేటాబేస్ లో లేనట్లయితే సింపుల్ గా మనం మన కెమెరా నుంచి ఆ ప్రాడక్ట్ ఫొటో తీసి పంపితే.. దానిని తన డేటా బేస్ లో నిక్షిప్తం చేసుకుంటుంది. అలాగే దాని వివరాలను కూడా మనకు వెంటనే పంపుతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా తదితర దేశాల్లో ఈ యాప్ సక్సెస్ అయ్యింది. సుమారు 6 లక్షల మంది దీనిని డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు మన దేశంలో దీనిని లాంచ్ చేశారు.

English summary

A new app called "Food Swtitch" says the user that what to eat . This app were released by george institute for global health from sydney,australia