ఆహార దొంగతనం తప్పుకాదన్న కోర్టు

Food Theft Was Not A Crime Says Italy Court

01:04 PM ON 14th May, 2016 By Mirchi Vilas

Food Theft Was Not A Crime Says Italy Court

కొన్ని అంశాలు మానవతా దృక్పధం తో చూడాలి అంటారు కదా .. కోర్టు కూడా దీన్నే పరిగణన లోకి తీస్కుంది. అందుకే నిరాశ్రయులు, నిరుపేదలు ఆహారాన్ని దొంగిలించడం తప్పుకాదని ఇటలీ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఉక్రెయిన్‌కు చెందిన రోమన్ ఓస్టియోకోవ్ ఉత్తర ఇటలీలోని జెనోవాలో ఉంటున్నాడు. 2011లో అతను 5 డాలర్ల విలవైన చీజ్, సాసేజ్ ను ఒక సూపర్ మార్కెట్ నుంచి దొంగిలించాడు. దాంతో అతడిని దోషిగా నిర్ధారించిన దిగువ కోర్టు అతనికి ఆరు నెలల జైలు శిక్ష, 100 యూరోలు ఫైన్ విధించింది. నిందితుడు చేసిన తప్పునకు పశ్చాత్తాప పడుతున్నాడని, అతనికి శిక్షను తగ్గించాలని ప్రభుత్వ న్యాయవాది సుప్రీం కోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ఆకలితో ఉన్న నిరుపేదలు తిండి కోసం చేసిన దొంగతనాన్ని నేరంగా పరిగణించలేమని, అది పెద్ద తప్పు కాదని స్పష్టం చేసింది. అతనికి కింది కోర్టు విధించిన శిక్షను సుప్రీం కోర్టు కొట్టేసింది.

ఇవి కూడా చదవండి:కబాలి రిలీజ్ డేట్ ఖరారు

ఇవి కూడా చదవండి:సొంత చెల్లి పై అత్యాచారం చేసి గర్భవతిని చేసాడు

ఇవి కూడా చదవండి:ఇంట్లో భార్యలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా?(వీడియో)

English summary

Italy Supreme Court was given a sensational Judgement that if any Poor people theft food then it would not be a crime. Italy Supreme Court was said this in a real incident occurred in the country.