గర్భవతులు ఈ ఫుడ్స్ తినకూడని తెలుసా?

Foods should not take during pregnancy

03:13 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Foods should not take during pregnancy

తల్లి కావాలనే ప్రతి మహిళ కోరుకుంటుంది. పెళ్ళైన దగ్గర నుండి అమ్మ అని ఎప్పుడు పిలిపించుకుంటానా అని ఆశగా ఎదురుచూస్తుంది. అలాంటి తరుణం వచ్చాక, గర్భం దాల్చిన తరువాత ఏం తినాలి ఏం తినకూడదు అని మహిళలకి ఒకటే టెన్షన్‌. సరైన కేర్‌ తీసుకోకపోతే తల్లికి, బిడ్డకు కూడా మంచిదికాదు. అందువల్ల ఆహారం విషయంలో ఏం తింటే మంచిది అనే విషయాన్ని తెలుసుకుని తినాలి. మంచి పోషక విలువలు కలిగిన ఆహారాలు, విటమిన్స్‌, ఖనిజాలు రోజు వారిడైట్‌లో చేర్చాలి. ప్రెగ్నెన్సీ టైంలో తీసుకునే ఆహారం శిశువు పెరుగుదలకు ఉపయోగపడేలా సహాయపడతాయి. మంచి ఆహారపు అలవాట్లు అలవాటు చేసుకోవడం వల్ల తల్లి బిడ్డలకు చాలామంచిది. ఆహారాలు ఆరోగ్యకరమైనవే అయినా కూడా గర్భవతులకు కొన్ని ఆహారాలు మంచివి కాదు. అలాంటి ఆహారాలు ఏమిటో వేటికి ప్రెగ్నెంట్స్‌ దూరంగా ఉండాలో స్లైడ్‌ షోలో చూడండి.

1/6 Pages

పాల ఉత్పత్తులు

పచ్చిపాలతో తయారయిన ఎటువంటి పదార్ధాలను తీసుకోకూడదు. వీటిని సేవించడం వలన అనేక ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఈ పాలఉత్పత్తులు పుట్టబోయే బిడ్డపైన ప్రభావం చూపుతాయి. కాబట్టి పచ్చిపాలను గర్భిణీ స్త్రీలు అసలు తీసుకోకూడదు. గర్భిణీగా ఉన్నప్పుడు జాగ్రత్త వహించి ఏం తినాలో తెలుసుకుని తినడం చాలా మంచిది.

English summary

In this article, we have listed about what type of foods you should not take during pregnancy. Cheeses like this are made with mould and can contain listeria bacteria that cause listeriosis.