అశ్లీల ధృశ్యాల బ్లాక్ మెయిల్  కేసులో ఫ్రాన్స్ ఫుట్ బాల్ ఆటగాడి కి జైలు శిక్ష.

 Footballer karim Benzema is arrested

07:55 PM ON 6th November, 2015 By Mirchi Vilas

 Footballer karim Benzema is arrested

ఆశ్లీల ధృశ్యాలతో బ్లాక్ మెయిల్ కు పాల్పడిన ఫుట్ బాల్ ఆటగాడు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన ఫ్రాన్స్ లో చోటు చేసుకుంది.

ఆశ్లీల ధృశ్యాలు చూపి తోటి ఆటగాడిని బ్లాక్ మెయిల్ చేసిన ఫుడ్ బాల్ ఆటగాడు కరీం బెంజిమా ను పారిస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తన తోటి ఆట గాడు మ్యాత్యూ కి సంబంధించిన టేప్ లను కరీం సేకరించి బెదిరిస్తున్న కారణం గా అతడిని అరెస్ట్ చేసారు.ఫ్రెంచ్ చట్టాల ప్రకారం కరీం ను విచారిస్తున్నారు. కరీం ను కస్టడీలోనే ఉండవలసింది గా వెర్సైల్లెస్ పోలీస్ స్టేషన్ అదికారులు చెప్పారు. ఆక్టోబర్ లో ఆరోపణ మోపబడిన మిగిలిన ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. ఇంకా దీనికి సంబందించిన నిందితుల కోసం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.గత నెల లో ఇలాంటి కేసుకు సంబందించి మాజీ అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారుడు సిస్సే ను బ్లాక్ మెయిల్ ఆరోపణ కేసు లో అరెస్ట్ చేసారు. ఈ కేసు లో కోర్ట్ సిస్సేకు 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయ్ . ఈ రెండు ఘటనలతో ప్రస్తుతం ఫ్రాన్స్ జట్టులోఈ ఇధ్దరు ఆటగాళ్లు లేరు.

English summary

 Footballer karim Benzema is arrested