పొడవైన జుట్టు కోసం

For long hair follow these steps

12:35 PM ON 5th December, 2015 By Mirchi Vilas

For long hair follow these steps

అందమైన అమ్మాయిలకి పొడవైన జుట్టు ఉంటే ఆ అందమే వేరు. ఇటీవల అబ్బాయిలు కూడా స్టైల్‌ కోసం పొడవైన జుట్టుని పెంచుకుంటున్నారు. వివిధ రకాల స్టైల్‌ లో జుట్టుని తీర్చిదిద్ధుకుంటున్నారు. కాని ఫ్యాషన్‌ ని ఫాలో అవ్వాలంటే జుట్టు వత్తుగా ఉండాలి కదా. ఇటీవల జుట్టుకి సంభందించిన ఎన్నో సమస్యలు యువతను వెంటాడుతున్నాయి. చిన్న వయసులోనే జుట్టు రాలడం, బట్టతల, జుట్టునెరవడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వాతావరణంలో కాలుష్యం వలన జుట్టు ఊడిపోతుంది. అలాగే వివిధ రకాల సమస్యలకు కారణమవుతుంది. చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి జుట్టు పెరగడం లేదని నిరాశ చెంది ఉంటారు. అలాంటి వారు కొన్ని చిట్కాలను పాటించి చూడండి. తప్పకుండా మార్పు సంభవిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇంట్లోనే ఉంటూ సులభంగా పాటించే కొన్ని పద్ధతులను ఎలా అనుసరించాలో చూద్ధాం.

ఇంటి చిట్కాలు

1. వేడి నూనె

మీరు తలకి నూనె పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆ ఆయిల్‌ ని కొంచెం వేడి చేసి రాసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది.వేడి చేసిన ఆయిల్‌ని తలకి రాసుకుంటూ, వేళ్ళతో మసాజ్‌ చేయడం వలన రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.జుట్టుకు సహజసిద్ధమైన కొబ్బరినూనె, ఆలివ్‌ ఆయిల్‌, ఆముదము మరియు నువ్వుల నూనె ని రాసుకోవడం, మసాజ్‌ చేసుకోవడం వలన జుట్టు ఎదగడానికి తమవంతు సాయం చేస్తాయి.ఈ సహజసిద్ధమైన నూనెలు జుట్టుని బలంగా మరియు వత్తుగా పెరగడానికి తోడ్పడతాయి.

చల్లని నూనెని రాసుకోవడం కంటే వేడి చేసిన నూనెని రాసుకోవడం వలన జుట్టు తొందరగా పెరిగే అవకాశాలు అధికం. వేడి నూనెతో మసాజ్‌ చేయడం వలన జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా వత్తుగా పెరుగుతుంది. మసాజ్‌ వల్ల రక్తప్రసరణ బాగా జరిగి జుట్టుని పొడవుగా పెరగడంలో దోహద పడుతుంది.

2. బంగాళదుంపలు

 • జుట్టుకి బంగాళదుంపలు వాడతారా? అని ఆశ్చర్యపోతున్నారా.. బంగాళదుంప జుట్టు వేగంగా పెరగడంలో సహాయపడుతుంది.
 • మూడు బంగాళదుంపలను తీసుకొని మిక్సీలో వేసి బాగా మెత్తగా చేసుకోవాలి.
 • దాని నుండి వచ్చిన రసాన్ని వేరుగా తీసుకొని అందులో గుడ్డు తెల్లసొనని, కొద్ధిగ నీటిని మరియు తేనె ఒకటీస్పూన్‌ కలపాలి.
 • ఈ మిశ్రమాన్ని తలకి బాగా పట్టించి 30 నిమిషాల తరువాత వేడి నీటితో బాగా రుద్ధుకుంటూ తలకి స్నానం చేయాలి.
 • ఈ విధంగా కొన్ని నెలలపాటు వారానికి ఒకసారి చేయడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు.
 • వంటింటి చిట్కాలలో ఇదో గొప్ప సమర్ధవంతమైన చిట్కాగా చెప్పవచ్చు.

3. ఉల్లిపాయలు

ఉల్లిపాయ రసాన్ని జుట్టుకి రాసుకోవడం వలన జుట్టు మెత్తగా మారడంతో పాటు ప్రకాశవంతంగా చేస్తుంది. జుట్టు పెరుగుదలలో ఉల్లిపాయ అద్భుతం గా పనిచేస్తుంది.

కావలసినవి :

 • వెల్లుల్లి రేకలు - 4
 • లవంగాలు - 4
 • దాల్చిన చెక్క - 2 ముక్కలు
 • ఎర్ర ఉల్లిపాయ - 1

ఉపయోగించే విధానం :

 • వీటన్నింటిని కలిపి బాగా వేడిచేయాలి.
 • వేడి అయిన మిశ్రమాన్ని చల్లారిన తరువాత ఆ రసంతో తలని బాగా వేళ్ళ సహాయంతో మర్ధన చేయాలి.
 • ఇలా 15 నిమిషాలు గడిచిన తరువాత వెచ్చని నీటితో మీ జుట్టుని కడగాలి.
 • ఈ విధంగా చేయడం వలన జుట్టుకి కావలసిన విటమిన్లు, పోషకాలు అంది ఆరోగ్యకరమైన మరియు పొడుగైన జుట్టు మీ సొంతం అవుతుంది.
 • జుట్టు చిట్లడం, నెరవడం, జుట్టురాలుట, చుండ్రు వంటి సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం అభిస్తుంది.
 • ఈ రెమిడీ మీ జుట్టుని వేగంగా పెరగడంలో సహాయపడుతుంది.

4. పోషకాహారం

చక్కని వత్తైన, పొడవైన జుట్టు కావాలనుకునే వారు చక్కటి పోషకాహారాలు తీసుకోవాలి.తాజా పండ్లు తినడంవలన, యోగా, వ్యాయామం చేయడం వలన మంచి ఆరోగ్యంతో పాటు జుట్టుని కూడా ఆరోగ్యంగా పెరగడం లో సహాయపడుతుంది.

వత్తిడి వలన జుట్టు రాలిపోవడం, తలనొప్పి, జుట్టు తెల్లని రంగులోకి మారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల వత్తిడికి గురికాకుండా ఎప్పుడూ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. యోగా మరియు వ్యాయామాలు చేయడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. అదే విధంగా మెడిటేషన్‌ వల్ల మనస్సుకి ప్రశాంతత లభిస్తుంది.

మొలకెత్తిన గింజలు, పప్పు దినుసులు, పెరుగు, పాలు, బ్రోకలీ, క్యారెట్స్‌, కరివేపాకు, తాజా పండ్లు మొదలగునవి తినడం వలన జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో సహాయపడతాయి.

వీటిని తినడం వలన జుట్టుతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీలయినంత వరకు తాజా ఆహారాన్ని తినండి.అదే విధంగా నవ్వడం వలన మీ వత్తిడి దూరం అవుతుంది. అందువల్ల ఎప్పుడూ సంతోషంగా ఉండడానికే ప్రమత్నించండి.

5. విటమిన్స్‌

జుట్టు పెరుగుదలలో విటమిన్లు సహాయపడతాయి. మీరు రోజు ఫోరిక్‌ యాసిడ్‌, బయోటిన్‌ మాత్రలు వాడడం వలన జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి.ఈ మాత్రలు అద్బుతంగా పనిచేసి జుట్టుని బలోపేతంగా చేస్తాయి. ఎ,ఇ మరియు సి విటమిన్లు జుట్టుని మృదువుగా, సిల్కీ గా మారుస్తాయి. పొడవైన జుట్టు కావాలి అనుకునే వారు ఈ వంటింటి చిట్కాలను పాటించడం ద్వారా జుట్టుని మృదువుగా, పొడవుగా పెరిగేలా చేసుకోవచ్చు. ఈ చిట్కాలను కొన్ని నెలలపాటు వాడడం ద్వారా మీరు ఫలితాన్ని పొందుతారు.

చిట్కాలను పాటించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని సేవించడం ద్వారా తొందరగా ఫలితాన్ని పొందుతారు. జుట్టుని ఎప్పుడూ బిగుతుగా వేసుకోకూడదు. దాని వల్ల జుట్టు తెగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల జుట్టుని వదులుగా వేసుకోవాలి. అంతేకాకుండా జుట్టుని వదులుగా వదలడం వలన పెరుగుదలకి సహాయపడుతుంది. ప్రతి రోజు చేతి వేళ్ళతో మసాజ్‌ చేసుకోవడం వలన రక్త ప్రసరణ జరిగి జుట్టు వత్తుగా మరియు పొడవుగా పెరుగుతుంది.

English summary

For long hair follow these steps. Easier way to grow hair quickly, but thankfully there are home remedies that can grow your hair fast.