ఊపిరికి ఫోర్బ్స్ ప్రశంసలు 

Forbes Magazine Special Article On Oopiri Movie

11:01 AM ON 29th March, 2016 By Mirchi Vilas

Forbes Magazine Special Article On Oopiri Movie

కింగ్ అక్కినేని నాగార్జున , తమిళ హీరో కార్తి , మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్లో దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "ఊపిరి". విదులైన మొదటి రోజు నుండి సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీసు వద్ద దూసుకుపోతున్న ఊపిరి చిత్రం ఇండియా లోనే కాక , యూ.ఎస్ లో సైతం రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తుంది. ఇంతకు ముందు తెలుగు సినిమాలు అమెరికా లో విడుదల అవ్వడమే కష్టంగా ఉండేది , అలాంటి తెలుగు సినిమాకు ఇప్పుడు ఇంతటి మార్కెట్ రావడం నిజంగా సంతోషించ దగ్గ విషయమే . చెప్పాలంటే తెలుగు సినిమాకు ఇంతటి మార్కెట్ సంపాదించిన చిత్రం "బాహుబలి". బాహుబలి చిత్రం యు.ఎస్ లో విడుదలై కొద్ది వారాల పాటు హాలీవుడ్ బాక్సాఫీస్ లో టాప్ టెన్ లో నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది . బాహుబలి చిత్రం లాగానే ఊపిరి సినిమా కుడా అదే రేంజ్ లో యు.ఎస్ మార్కెట్లో దూసుకుపోతూ హాలీవుడ్ బాక్సాఫీస్ లో టాప్ 20 లో 11 వ స్థానం సంపాదించి అందరిని ఆశ్చర్యపరిచింది.

ఇవి కుడా చుడండి :హీరోయిన్స్ ని ఏడిపిస్తున్నాడని వార్నింగ్ ఇచ్చిన మోహన్ బాబు

ఇలా అందరిని ఆశ్చర్యపరుస్తూ ఓ రేంజ్ లో దూసుకుపోతున్న ఊపిరి చిత్రం పై ప్రముఖ అంతర్జాతీయ మ్యాగ్ జైన్ ఫోర్బ్స్ పత్రిక ఒక ప్రత్యెక కథనాన్ని ప్రచురించింది. ఊపిరి సినిమా యు.ఎస్ లో మొత్తం 163 స్క్రీన్లలో ప్రదర్శింపబడుతూ ఇప్పటి వరకు 9.1 మిలియన్ డాలర్లను వాసులు చేసి , టాప్ 11 లో స్థానం సంపాదించిందని ఫోర్బ్స్ పత్రిక తెలిపింది . హాలీవుడ్ చిత్రం అయిన బ్యాట్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ , హిందీ చిత్రం రాకీ హ్యాండ్సమ్ వంటి చిత్రాలకు ఊపిరి సినిమా గట్టి పోటి ఇస్తుందని ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది . ఇప్పటికే విడుదలైన మొదటి వారంలోనే రికార్డు కల్లెక్షన్స్ తో దూసుకుపోతున్న ఊపిరి సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూద్దాం.

ఇవి కుడా చుడండి:

బాహుబలికి అవార్డా? అంటూ వర్మ ట్వీట్

భళా బాహుబలి భళా

English summary

King Akkineni Nagarjuna,Karthi,Tamanna;s Oopiri movie was released and become super hit at the box office.Oopiri movie was also released in U.S. become supet hit and it collected 9.1 million dollars in first week. Oopiri movie stood 11th place in U.S Box Office.Forbes Magazine printed a special story on Oopiri movie.