భారత్‌లో రహస్య అణు పరిశోధనలు: ఫారిన్ పాలసీ

Foreign Policy journal India building secret nuclear

07:27 PM ON 18th December, 2015 By Mirchi Vilas

Foreign Policy journal India building secret nuclear

భారత్‌లో రహస్యంగా అణు పరిశోధనలు సాగుతున్నాయా.. పాకిస్థాన్ ను అస్థిర పరిచేందుకు భారత్ ప్రయత్నిస్తోందా.. దీనికి అవునే అంటోంది ఒక అంతర్జాతీయ పత్రిక. పాకిస్థాన్ ను అస్థిర పరిచేందుకు భారత్ అత్యంత రహస్యంగా దక్షిణ కర్నాటకలో అణు పరిశోధనలు సాగిస్తోందని అంతర్జాతీయ పత్రిక ఫారిన్ పాలసీ సంచలన వార్తలను ప్రచురించింది. పౌర అవసరాల కోసం అణు సామర్థ్యాన్ని పెంచుకునేందుకు భారత్ అక్కడ పరిశోధనలు సాగిస్తున్నదని ఆ పత్రిక వివరించింది. ఈ ప్రాజెక్టు 2012లోనే మొదలైందని, ఇందుకోసం దక్షిణ కర్నాటకలోని ఛెల్లకెరి వద్ద గిరిజనులకు చెందిన పచ్చిక బెయిళ్లను స్వాధీనం చేసుకుందని వెల్లడించింది. చెళ్లకెరెలోని నిర్మిస్తున్న న్యూక్లియర్ సిటీ నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరుగుతోందని, 2017నాటికి పూర్తి కానున్న ఈ న్యూక్లియర్ సిటీ భారత ఉపఖండంలోనే సైన్యం నిర్వహణలో నడిచే అతిపెద్ద న్యూక్లియర్ సెంట్రీఫ్యూజుల కేంద్రంగా, అణు పరిశోధన ప్రయోగశాలలు, ఆయుధాలు, విమానాల పరీక్షా కేంద్రంగా నిలుస్తుందని వెల్లడించింది. ఈ న్యూక్లియర్ సిటీలో భారత్ శుద్ధచేసిన యురేనియం ఇంధన నిల్వలను పెంచుకుని హైడ్రోజన్ బాంబులను తయారు చేస్తున్నట్లు రిటైరైన భారత అధికారులను, లండన్, వాషింగ్టన్ నగరాలకు చెందిన నిపుణులను ఉదహరిస్తూ తెలిపింది. ఈ న్యూక్లియర్ సిటీని నిర్మించడం ద్వారా భారత్ అత్యంత శక్తివంతమైన అణ్వస్త్రదేశంగా అవతరిస్తుందని, అయితే ఈ పరిమాణం భారత్ పొరుగుదేశాలైన పాకిస్థాన్, చైనాలను తీవ్ర అసహనానికి గురి చేస్తాయని అందులో పేర్కొంది.

English summary

Foreign Policy journal said that India is building a top-secret nuclear city to produce thermonuclear weapons and when completed in 2017 the facility would be the subcontinent's "largest military-run" complex