కెనడా దావాగ్ని- వేలమంది ఎయిర్‌లిఫ్ట్‌

Forest Fires In Canada

06:47 PM ON 6th May, 2016 By Mirchi Vilas

Forest Fires In Canada

కెనడాలోని అల్బెర్టా ప్రావిన్స్‌లో అడవుల్లో చెలరేగిన మంటలు విపరీతంగా వ్యాపిస్తున్న కారణంగా ఫోర్ట్‌ మెక్‌ముర్నే నగరం తగలబడిపోతోంది. దావాగ్ని కారణంగా ఫోర్ట్‌మెక్‌ముర్రే నగరంలోని సుమారు 1600 భవనాలు ఇప్పటికే దగ్ధ మయ్యాయి. ఈ దావాగ్ని ఇంకా పెరుగుతూనే ఉంది. ఫోర్ట్‌మెక్‌ముర్రే నుంచి నగర ఉత్తర ప్రాంతంలోకి వెళ్లిన వారిని సహాయక సిబ్బంది విమానాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు. మంటలు అటువైపు వ్యాపిస్తుండడంతో సుమారు 8వేల మందిని ఇప్పటికి ఎయిర్‌లిఫ్ట్‌ చేశారు. నగరం నుంచి ప్రజలు వేరే చోటికి వెళ్తే అక్కడ కూడా మంటలు వ్యాపిస్తుండడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

ఫోర్ట్‌ మెక్‌ముర్రేకు పొంచి ఉన్న ప్రమాదం కారణంగా నగరంలోని దాదాపు 88వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. అయితే నగరానికి దక్షిణ ప్రాంతం మాత్రమే ప్రస్తుతం సురక్షితంగా ఉంది. ఉత్తర ప్రాంతానికి మళ్లీ ప్రమాదం పొంచి ఉంది. దీంతో అటువైపు వెళ్లిన దాదాపు 17వేల మందిని సహాయక సిబ్బంది రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది హెలికాప్టర్లు, ఎయిర్‌ ట్యాంకర్ల ద్వారా మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

31 వేళ్ళతో పుట్టిన శిశువు

బాలికపై అత్యాచారం చేసిన ఎమ్మెల్యే

English summary

Forest Fire Continues in Canada. Fire department in Canada was trying to stop that fire by using water tankers and etc.