రాహుల్‌ కోసం చెప్పులు మోసిన మాజీమంత్రి

Former Uninon Minister Holds Cheppals For Rahul Gandhi

11:12 AM ON 9th December, 2015 By Mirchi Vilas

Former Uninon Minister Holds Cheppals For Rahul Gandhi

స్వామిభక్తిని నిరూపించుకోవడంలో కాంగ్రెస్‌ నాయకులను మించిన వారెవ్వరూ ఉండరేమో. అందుకనే ఏకంగా యువరాజా వారికోసం పాదరక్షలను మోసి తరించారు ఒక మాజీ మంత్రి. అసలు వివరాల్లోకెళితే వరదలతో అల్లకల్లోలమైన పాండిచ్చేరిలో పాదయాత్ర తలపెట్టారు కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ. ఈ పాదయాత్ర సందర్భంగా షూలతో వచ్చిన రాహుల్‌, వరదలో సౌకర్యంగా నడిచేందుకు తన షూ మార్చుకునే సందర్భంలో పాండిచ్చేరి ప్రజాప్రతినిధి, మాజీ కేంద్ర మంత్రిగా కూడా భాధ్యతలు నిర్వర్తించిన వి నారాయణస్వామి పెద్దమనిషి చెప్పులను పట్టుకుని వీరవిధేయత ప్రదర్శించాడు. ఎంత కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు అయినంత మాత్రాన, ఒక పార్లమెంట్‌ సభ్యుని హోదాను సైతం పక్కన పెట్టి ఇలా పాదరక్షలను చేత పెట్టుకుని నిలబడ్డ సదరు మాజీ మంత్రి, తాజా ఎంపీ అయిన నారాయణస్వామి వీరవిధేయతను చూసి అక్కడి వారు ముక్కున వేలేసుకున్నారట. అయితే కేవలం రాహుల్‌ గాంధీ చెప్పులు లేకుండా ఇబ్బంది పడడం చూసి తన చెప్పులను ఇవ్వడానికి మాత్రమే తాను ప్రయత్నించానని ఈ సందర్భంగా నారాయణస్వామి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. రాహుల్‌ ఎప్పుడూ తన చెప్పులను ఎవ్వరికీ ఇవ్వరనీ, ఆఖరుకి సెక్యూరిటీ సిబ్బందికి సైతం పాదరక్షలను మోయించడని నారాయణ స్వామి రాహుల్‌ భజన ప్రారంభించాడు. కాంగ్రెస్‌లో అందరూ అనుకున్నట్లుగా అతి వినయం వహించాల్సిన అవసరం ఉండదంటూ చెప్పుకొచ్చిన నారాయణ స్వామి కాంగ్రెస్‌లో ఎప్పుడు భజన రాజకీయాలకు స్థానం లేదంటూ గొప్పగా చెప్పుకొచ్చాడు.

English summary

Former uninon minister of India V.Narayanasamy holds the cheppals For Congress Vice-President Rahul Gandhi on tour of pondicherry flodded areas