రేప్ చేస్తుంటే ఎదిరించిందని ఏం చేసారో తెలుసా?

Four Men Chop Off 20 Years Old Girl Ears For Resisting Rape In UP`

10:52 AM ON 7th January, 2017 By Mirchi Vilas

Four Men Chop Off 20 Years Old Girl Ears For Resisting Rape In UP`

కామంతో కళ్ళుమూసుకుపోయిన కామాంధులను ప్రతిఘటించిన ఓ అమ్మాయి పట్ల నలుగురు కామాంధులు అత్యంత అమానుషంగా, కిరాతకంగా ప్రవర్తించారు. ఏకంగా ఆ అమ్మాయి చెవులను కోసేశారు. సంచలనం సృష్టించిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బాఘ్ పత్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, జనవరి 4న, నలుగురు మదమెక్కిన కామాంధులు బాధిత యువతి ఇంట్లో చొరబడ్డారు. ఆపై ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు. ఈ క్రమంలో బాధిత యువతి వారి లైంగిక దాడిని తీవ్రంగా ప్రతిఘటించడంతో.. ఆమె చెవులను కోసేశారు.

అయితే, స్థానిక బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ స్పందిస్తూ చేసిన వాదన మాత్రం మరోలా ఉంది. అసలు ఆమెపై అత్యాచారయత్నమే జరగలేదని, బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో ఎలాంటి వాస్తవం లేదని అంటున్నారు. . 'ఈ విషయంపై నేను స్థానిక ఎస్పీతో వ్యక్తిగతంగా మాట్లాడా. డిసెంబర్31 ఉదయం ఈ ఘటన చోటు చేసుకుందని ఆయన చెప్పారు. ఇది ఇద్దరు ఇరుగు-పొరుగు మధ్య నెలకొన్న సమస్య అని, అయితే ఘటన జరిగిన చాలారోజులకు దీనిపై ఫిర్యాదు చేయడంతో.. ఇందులో వాస్తవం లేదనిపిస్తోందని ఎస్పీ చెప్పారు' అని ఆ ఎంపీ చెప్పడం చూస్తుంటే అసలు ఏమి జరిగిందో తెలియడంలేదని అంటున్నారు.

ఇవి కూడా చదవండి: ధోనీ కెప్టెన్సీని వదులుకోవడానికి అసలు కారణాలు ఇవేనట

ఇవి కూడా చదవండి: వావ్ ... సరికొత్త ఫీచర్లతో ఆండ్రాయిడ్ స్మార్ట్ సైకిల్

English summary

Four Men in Uttar Pradesh has behaved like a sadists and they used to cut off the 20 year old girl's ears for resisting Rape. This incident made sensation in UP and police were in investigation on this case.