ఆ నలుగురిని ఎందుకు గెంటేశారు

Four Passengers Thrown Out Of Plane

02:16 PM ON 26th November, 2015 By Mirchi Vilas

Four Passengers Thrown Out Of Plane

యుఎస్‌లోని బాల్టిమోర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే విమానం ఎగరడానికి సిద్ధంగా ఉన్న సమయంలో అనుమానాస్పదంగా ఉన్న నలుగురి ప్రయాణికులను భద్రతాసిబ్బంది బయటకు గెంటేశారు. ఉగ్రవాద చర్యలు ప్రపంచమంతా పెరిగిపోతున్న ఈ సమయంలో అగ్రరాజ్యం అమెరికా భద్రత విషయంలో మరింత కట్టుదిట్టంగా ఉంటుందని చాటి చెప్పే ఈ సంఘటన వివరాలల్లోకెళితే... బాల్టిమోర్‌ నుండి చికాగోకు వెళుతున్న ఫ్లైట్‌ 969 మరికొద్ది క్షణాలల్లో టేకాఫ్‌కు సిద్ధమైంది. అందులోని ఒక ప్రయాణికురాలు తన తోటి ప్రయాణికుడు కొంచెం అనుమానాస్పదంగా ఉన్నాడని, తన ఫోన్‌లో డైనమైట్‌ అనే పదం కూడిన టెక్ట్స్‌ మెసేజ్‌లు పంపుతున్నాడని భద్రతాసిబ్బందికి ఫిర్యాదు చేసింది.

ఆ ఫిర్యాదు మేరకు సదరు ప్రయాణికుడిని తనఖీచేసిని వారికి అటువంటి అనుమానస్పదమైన వస్తువులుకానీ, ఫోన్‌లో మెసెజ్‌లు కానీ కనపించలేదు. అయినప్పటికీ ఏమాత్రం చాన్స్‌ తీసుకోలేని భద్రతాసిబ్బంది ఆ మహిళను, వ్యక్తిని మరో ఇద్దరిని విమానం నుండి బయటకు దింపేసి విమానాన్ని పంపేశారు. తదుపరి విచారణలో తేలిందేమిటంటే సదరు ఇంగ్లీష్‌ కాకుండా ఇతర భాష మాట్లాడుతున్న వ్యక్తి పంపిన మెసెజ్‌లో బిఎల్‌ఆర్‌ డైనమైట్‌ అని, బిఎల్‌ఆర్‌ అంటే బెంగుళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉన్న కోడ్‌ నేమ్‌ అట. అనవసరంగా ఆందోళనలకు గురయ్యి వివాదానికి కారణమైన మహిళతో పాటు మరో ముగ్గురు తమ గమ్యస్థానాలకు అనుకున్న సమయానికి చేరలేకపోయారు. పోలీసులు ఎటువంటి కేసులు లేకుండానే వారిని విడుదల చేసారట.

English summary

Four passengers were removed from a flight at Baltimore's international airport after a fellow passenger said she saw one of them receive a text with the word "dynamite."